గొప్ప మనసు చాటుకున్న మంచు హీరో ....120 మంది దత్తత తీసుకున్న విష్ణు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ లలో మంచు ఫ్యామిలీ( Manchu Family ) ఒకటి.

మోహన్ బాబు( Mohan Babu ) ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక మోహన్ బాబు వారసులుగా మంచు లక్ష్మి మనోజ్ విష్ణు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే ఇక మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూనే మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలను అదేవిధంగా సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.త్వరలోనే కన్నప్ప( Kannappa ) సినిమా ద్వారా విష్ణు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Manchu Vishnu Adopted 120 Orphans Details, Manchu Family, Vishnu, Mohan Babu, Ka

ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మోహన్ బాబు కుటుంబ సభ్యులందరూ కూడా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు.మోహన్ బాబు తన కొడుకు విష్ణు కుటుంబంతో కలిసి నేడు ఉదయం భోగి మంటలు వేసి ఎంతో ఘనంగా భోగి పండుగను జరుపుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Manchu Vishnu Adopted 120 Orphans Details, Manchu Family, Vishnu, Mohan Babu, Ka

సంక్రాంతి అంటేనే రైతుల పండుగ రైతు బాగుంటే దేశం కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరూ బాగుండాలి అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Manchu Vishnu Adopted 120 Orphans Details, Manchu Family, Vishnu, Mohan Babu, Ka

ఇక పండుగ పూట మంచు విష్ణు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు.ఈయన ఏకంగా 120 మంది అనాధలను దత్తత తీసుకొని వారి పూర్తి బాధ్యతలను తీసుకున్నారు.తిరుపతిలోని బైరాగి పట్టెడ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను హీరో మంచు విష్ణు దత్తత తీసుకున్నారు.

విద్యా, వైద్యంతో పాటు అన్ని విషయంలో ఓ కుటుంబ సభ్యుడిలా తోడుంటానని , ఇకపై ఆ 120 మంది బాధ్యత నాదేనని, వారంతా నా కుటుంబ సభ్యులే అంటూ విష్ణు తెలిపారు.ఇలా విష్ణు చేసిన మంచి పనికి అభిమానులు ఎంతో ఫీదా అవుతున్నారు.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!
Advertisement

తాజా వార్తలు