అలాంటి అన్నయ్య ఎవరికీ ఉండొద్దు అంటూ మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!

మన ఇండస్ట్రీ లో గర్వంగా చెప్పుకునే లెజండరీ నటులలో ఒకడు మోహన్ బాబు.

( Mohan Babu )చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకొని స్టార్ హీరోలలో ఒకడిగా దశాబ్దాలు కొనసాగాడు.

కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, విద్యావేత్తగా మోహన్ బాబు సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.అలాంటి లెజెండ్ కొడుకులు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచి విష్ణు మరియు మంచు మనోజ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.

విష్ణు తో పోలిస్తే మనోజ్ కి మంచి టాలెంట్ ఉంది, క్రేజ్ కూడా ఉంది.కానీ ఆయన కెరీర్ లో మరో లెవెల్ కి వెళ్లబోతుంది అని అనుకుంటున్న సమయం లో భారీ గ్యాప్ ఇచ్చి కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నాడు.

Manchu Manojs Shocking Comments Saying That No One Should Have Such An Elder Br

ఇక మంచు విష్ణు( Manchu Vishnu ) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇతని కెరీర్ లో సూపర్ హిట్స్ ఉన్నాయి కానీ, స్థిరమైన మార్కెట్ లేదు.కానీ పట్టువదలని విక్రమార్కుడి లాగ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

Advertisement
Manchu Manoj's Shocking Comments Saying That No One Should Have Such An Elder Br

కానీ హిట్స్ మాత్రం రావడం లేదు, ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్ గా గెలిచినా విష్ణు, అమెరికా కి ప్రెసిడెంట్ అయ్యినంత గొప్పగా ఫీల్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు కి మరియు మంచు మనోజ్( Manchu Manoj ) కి చాలా కాలం నుండి పడడం లేదు, ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇది కేవలం రూమర్ మాత్రమే అని అనుకున్న నెటిజెన్స్ కి మంచు విష్ణు మరియు మనోజ్ మధ్య గొడవ మనోజ్ లైవ్ రికార్డు చేసి ఇంస్టాగ్రామ్ లో పెట్టాడు. ఈ వీడియో పెద్ద సంచలనమే రేపింది.

Manchu Manojs Shocking Comments Saying That No One Should Have Such An Elder Br

రీసెంట్ గా మనోజ్ తన అన్నయ్య విష్ణు ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.ఆయన మాట్లాడుతూ అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ కూడా ఈగోలు ఉండకూడదు.అలా ఉంటే సుఖం గా ఉండలేము.

తమ్ముడు విజయం సాధిస్తే ఓర్వలేని అన్నయ్య ఉండడం కంటే లేకపోవడం బెటర్ అంటూ మంచు మనోజ్ అన్నదమ్ముల సంబంధం గురించి పరోక్షంగా విష్ణు పై వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు