మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి వేడుకలు... ఫోటోలు వైరల్!

మంచు మనోజ్( Manchu Manoj ) గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

తన కుటుంబ సభ్యులతో ఆస్తి విషయంలో చోటుచేసుకున్నటువంటి గొడవలు నేపథ్యంలో మంచు కుటుంబం వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇకపోతే మంచు మనోజ్ గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు అయితే ఈ అన్న ఇటీవల మౌనికను( Mounika ) వివాహం చేసుకున్న తర్వాత తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే వరుసగా సినిమాలతో పాటు ఇతర షోలతో మనోజ్ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే సంక్రాంతి పండుగను( Sankranthi Festival ) పురస్కరించుకొని సెలబ్రిటీలదరూ కూడా సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే మంచు మనోజ్ సైతం తన కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారని తెలుస్తుంది.ఇక మెగా హీరోలైనటువంటి సాయి ధరంతేజ్,( Saidharam Tej ) వైష్ణవ్,( Vaishnav ) నటుడు నరేష్ కుమారుడు విజయ్ కృష్ణ ఇతరులు కలిసి ఒకే చోట ఈ పండుగను జరుపుకున్నారని తెలుస్తోంది.

ఇలా తన కుటుంబం అలాగే స్నేహితులతో కలిసి సంక్రాంతి( Sankranthi ) వేడుకలను జరుపుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలాగే తన కుమార్తె దేవసేన శోభకు ఇది మొదటి సంక్రాంతి అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు.మరోవైపు మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) మంచు విష్ణు( Manchu Vishnu ) ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకోగా మనోజ్ మాత్రం తన స్నేహితులతో ఈ వేడుకలను జరుపుకున్న నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏమాత్రం సర్దుమనగడం లేదని తెలుస్తుంది.

Advertisement

ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే.మిరాయ్, భైరవం, వాట్ ది ఫిష్  వంటి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు