అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రస్తుతం కన్నప్ప ( Kannappa ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు విష్ణు అల్లు అర్జున్ ( Allu Arjun ) అరెస్ట్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పుష్ప 2( Pushpa 2 ) విడుదల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనని చూడటం కోసం రావడంతో తొక్కిసలాట జరిగింది.

Manchu Vishnu Sensational Comments On Allu Arjun Arrest Details, Allu Arjun, Man

ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి( Revathi ) అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే  ఈ విషయంపై అల్లు అర్జున్ పట్ల కేసు నమోదు కావటం పోలీసులు తనని అరెస్టు చేసి తీసుకెళ్లడం జరిగింది.అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందించారు కానీ ఈ విషయంపై తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం మౌనం పాటించారు.ఇలా అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ మౌనంగా ఉండటానికి గల కారణాన్ని మంచి విష్ణు తెలిపారు.

Manchu Vishnu Sensational Comments On Allu Arjun Arrest Details, Allu Arjun, Man

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ మౌనంగా ఉండటానికి కారణం లేకపోలేదు.తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అంటూ ఇండస్ట్రీ నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలిపారు.

Advertisement
Manchu Vishnu Sensational Comments On Allu Arjun Arrest Details, Allu Arjun, Man

సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటూ మన పనులు మనం చేయించుకోవాలని మంచు విష్ణు తెలిపారు.తమకు కావాల్సిన బెనిఫిట్స్ ని రిక్వెస్ట్ చేయాలన్నారు మంచు విష్ణు.

ఎప్పుడూ ఏ ప్రభుత్వాన్ని పరిశ్రమ విమర్శించదు, వ్యతిరేకంగా మాట్లాడదని స్పష్టం చేశారు.అందుకే బన్నీ వివాదం విషయంలో అంతా సైలెంట్‌గా ఉన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు