నా భార్యను ఈ గొడవలోకి లాగారు... ఎవరిని వదిలిపెట్టను: మంచు మనోజ్

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు కుటుంబం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంది.

కేవలం వీరి కుటుంబ వ్యవహారాలు, ఆస్తి విషయంలో గొడవలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తరచూ విష్ణు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో ఈ గొడవలు కాస్త ఇటు మీడియా వార్తల్లోనూ సోషల్ మీడియా వార్తలలోనూ సంచలనంగా మారాయి.

గత కొద్ది రోజుల క్రితం మీడియా ముందే ఒకరిపై మరొకరు దాడి చేసుకుని పోలీస్ స్టేషన్లో వరకు వెళ్లారు అయితే ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి ఈ కుటుంబంలో గొడవలు చోటుచేసుకున్నాయి.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మోహన్ బాబు కుటుంబ సభ్యులందరూ కూడా తిరుపతి మోహన్ బాబు( Mohan Babu ) యూనివర్సిటీలో ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు.

అయితే బుధవారం మంచు మనోజ్( Manoj ) తన భార్య మౌనికతో( Mounika )  కలిసి యూనివర్సిటీకి వెళ్లారు అయితే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.మనోజ్ మౌనిక దంపతులను యూనివర్సిటీ ( University ) లోపలికి వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతి తెలియజేయలేదు దీంతో పెద్ద ఎత్తున మనోజ్ గొడవ చేశారు.

Manchu Manoj Gives Warning To His Father Mohan Babu And Vishnu , Mohan Babu, Vis

ఇక ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆయన గేటు లోపలికి వెళ్లి తన నానమ్మ తాతయ్యలకు నివాళులు అర్పించారు.అనంతరం మీడియా సమావేశంలో మనోజ్ మాట్లాడుతూ ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో నేను కూడా పెద్దగా జోక్యం చేసుకోలేదని తెలిపారు.అయితే నన్ను ఎందుకు లోపలికి రానివ్వడం లేదు అనే విషయం గురించి నాకు సమాధానం చెప్పాలి.

Advertisement
Manchu Manoj Gives Warning To His Father Mohan Babu And Vishnu , Mohan Babu, Vis

ఎందుకు నన్ను విద్యార్థులని కలవనివ్వలేదు అంటూ ప్రశ్నలు వేశారు.నాన్నకు తెలియకుండా ఇక్కడ చాలా జరుగుతున్నాయి వాటన్నింటినీ నాన్నకు తెలియచేయాలని నేను ప్రయత్నిస్తుండగా అక్కడి వరకు వెళ్లకుండా నన్ను అడ్డుకుంటున్నారని మనోజ్ తెలిపారు.

Manchu Manoj Gives Warning To His Father Mohan Babu And Vishnu , Mohan Babu, Vis

ఇక నేను వస్తున్న సందర్భంగా నా అభిమానులు ఫ్లెక్సీలు కడితే చింపేస్తున్నారు.బౌన్సర్లు ఉండకూడదని కోర్టు చెప్పినప్పటికీ ఢిల్లీ నుంచి కొంతమంది బౌన్సర్లను తెప్పించారని వారి చేతిలో పోలీసుల లాఠీలో ఉన్నాయని మనోజ్ తెలిపారు.ఇదివరకు నాపై చాలా కుట్రలు చేశారు అయినప్పటికీ నేను సైలెంట్ అయ్యాను మా అమ్మను కూడా బ్రెయిన్ వాష్ చేసి తను కూడా నాపై కంప్లైంట్ చేసేలాగా చేశారని మనోజ్ తెలిపారు.

నేను పోరాడుతున్నది ఆస్తుల కోసం కాదు.ఇక ఈ గొడవలోకి నా భార్య మౌనికను కూడా లాగారు.తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరు.

తనకు తండ్రి అయిన తల్లి అయినా అన్ని నేనే చూసుకోవాలి.తన జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను అంటూ ఈయన తన తండ్రి తన అన్నయ్యకు వార్నింగ్ ఇచ్చారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఇలా మరోసారి ఈ కుటుంబంలో గొడవలు చోటు చేసుకోవడంతో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు