నేను భయపడటం జన్మలో జరగదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మనోజ్(manchu manoj) కు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

మంచు మనోజ్ కీలక పాత్రలో ప్రస్తుతం పలు సినిమాలు తెరకెక్కుతుండగా ఆ సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

మంచు మనోజ్ పేరు ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వినిపించగా తాజాగా ఆయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మంచు మనోజ్(manchu manoj) మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించాలని చెప్పుకొచ్చారు.

ఎందుకంటే ఈ సమస్య నా ఒక్కడిదే కాదని నా స్టూడెంట్స్ కావచ్చు లేదా మా కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రజల కోసం కావచ్చని మనోజ్(Manoj) పేర్కొన్నారు.వారి కోసమే ఈ పోరాటం అని మనోజ్ వెల్లడించారు.

నేను అందరి కోసం పోరాడుతుంటే నాపై అటాక్స్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ నా కుటుంబ సభ్యులను ఇందులోకి లాగుతూ ఒక మనిషిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారని మనోజ్ తెలిపారు.ఇవన్ని చూసి నేను భయపడతానని అనుకుంటున్నారేమో అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.అది ఈ జన్మలో జరగదని మనోజ్ కామెంట్లు చేశారు.

Advertisement

మనోజ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో అయినా ఈ వివాదాలకు చెక్ పడుతుందేమో చూడాల్సి ఉంది.

మంచు మనోజ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.మంచు మనోజ్ కథ నచ్చితే విలన్ రోల్స్ లో కూడా నటిస్తున్నారు.

హీరో మంచు మనోజ్ తనపై, తన భార్యపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని అయితే ఆ కేసులన్నీ బోగస్ కేసులని చెబుతున్నారు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు