కూతురితో కలిసి ఇంటికి చేరుకున్న మనోజ్.. హడావిడి మామూలుగా లేదుగా?

నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj ) ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి మనకు తెలిసిందే ఈయన భూమి మౌనిక(Bhuma Mounika) ను గత ఏడాది వివాహం చేసుకున్నారు.

ఇక ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ( Baby Girl ) జన్మించారు.

పెళ్లి తర్వాత కొద్ది నెలలకే మౌనిక ప్రెగ్నెంట్ కావడంతో ఇదే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఎప్పటికప్పుడు మౌనిక ప్రెగ్నెన్సీ గురించి తన హెల్త్ అప్డేట్స్ ఇచ్చినటువంటి మంచు మనోజ్ ఇటీవల తనకు కుమార్తె పుట్టిందనే విషయాన్ని కూడా వెల్లడించారు.

తనకు కుమార్తె పుట్టిందని విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులందరూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లడించారు.అయితే ఇదివరకే భూమా మౌనికకు కుమారుడు కూడా ఉన్నారు.ఇప్పుడు కూతురు జన్మించడంతో మనోజ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

అయితే మొదటిసారి తన భార్య కూతురుతో కలిసి మనోజ్ తన ఇంటికి చేరుకున్నారు.మనోజ్ మౌనిక హాస్పిటల్ నుంచి తమ పాపాయిని తీసుకుని ఇంటికి రాగా పెద్ద ఎత్తున ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

మౌనిక పాపని ఎత్తుకొని రాగ మనోజ్ తన కూతురికి ఎండ పడకూడదు అంటూ చేతులు అడ్డు పెట్టుకోవడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక మొదటిసారి ఇంటికి వచ్చినటువంటి తన కూతురికి హారతి పట్టి ఇంట్లోకి ఆహ్వానించారు.ఇక ఇల్లు మొత్తం ఎంతో అందంగా అలంకరించారని కూడా తెలుస్తుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వీడియో చూసినటువంటి నెటిజన్స్ మనోజ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇక ఈ చిన్నారికి ఎంఎం పులి ( MM Puli ) అని నిక్ నేమ్ పెట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు