ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి... సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో ప్రభాస్ ( Prabhas )ఒకరు నటన పరంగా వృత్తిపరమైన జీవితంలో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో ఇంకా సింగిల్ గా ఉండడంతో ప్రభాస్ పెళ్లి( Marriage )కి సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి.

అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

  మంచు కుటుంబానికి ప్రభాస్ కి మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు కూడా నటించారు.

ఈ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో మోహన్ బాబు నటించిన నేపథ్యంలో ప్రభాస్ మోహన్ బాబును బావ అంటూ పిలుస్తూ వచ్చారు.అయితే ఇప్పటికీ కూడా మోహన్ బాబు ప్రభాస్ ఎక్కడ కలిసిన మోహన్ బాబుని బావ అని పిలుస్తారని మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

ఇక నాన్న ఏం అడిగినా ప్రభాస్ అసలు కాదనరని తెలియజేశారు.

Manchu Lakshmi Sensational Comments On Prabhas Marriage, Prabhas, Marriage, Manc
Advertisement
Manchu Lakshmi Sensational Comments On Prabhas Marriage, Prabhas, Marriage, Manc

ఈ క్రమంలోనే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన కన్నప్ప సినిమాలో కూడా రుద్ర పాత్ర కోసం ప్రభాస్ ని సంప్రదించడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని అంతే కాకుండా ఈ సినిమాలో చేసినందుకు ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది.ఇలా మోహన్ బాబు ప్రభాస్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

Manchu Lakshmi Sensational Comments On Prabhas Marriage, Prabhas, Marriage, Manc

ప్రభాస్ 2025 చివరికి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రభాస్ పెళ్లి గురించి మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి శుభవార్త చెప్పలేదు.అయితే ఇటీవల ఈయన పెళ్లి ఫిక్స్ అయిందని అమ్మాయి కూడా గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయి అంటూ కూడా ఒక వార్త చెక్కర్లు కొట్టింది.

ఇలాంటి తరుణంలోనే మంచు లక్ష్మి ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి అయిపోతుంది అంటూ కామెంట్లు చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు