అందంతా మంచు వారి డ్రామా అయితే.. మరి మనోజ్ ఎక్కడ భయ్యా?

ఇటీవల మంచు ఫ్యామిలీ లో విభేదాలు ఉన్నట్లుగా క్లారిటీ ఇస్తూ ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.

ఆ వీడియో మంచు మనోజ్( Manchu Manoj ) షేర్ చేశాడు.

మోహన్ బాబు తిట్టాడో.లేదంటే తానే వద్దు అనుకున్నాడో కానీ వెంటనే మనోజ్ ఆ వీడియోని డిలీట్ చేశాడు.

డిలీట్ అయిన ఆ వీడియో అప్పటికే సేవ్ అయిపోయింది.చాలా మంది స్క్రీన్ షాట్ తీసుకున్నారు.

కొన్ని మీడియా సంస్థలు వందల సార్లు ఆ వీడియోలు ప్లే చేస్తూ మంచు ఫ్యామిలీ లో గొడవలు అంటూ వార్తలు.కథనాలు ప్రస్తారం చేయడం మొదలు పెట్టారు.

Advertisement

ఇదంతా కూడా ఫ్రాంక్ అంటూ మంచు ఫ్యామిలీ చెప్పే ప్రయత్నం ఒకటి చేయబోతుంది.

డాక్యుమెంటరీ తరహా లో మంచి ఫ్యామిలీ లో ఏం జరిగింది అనే విషయాన్ని తెలియజేసేందుకు గాను మంచు విష్ణు( Manchu Vishnu ) ఒక వీడియో ని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఈ విషయంలో ఇప్పటి వరకు మంచు మనోజ్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు.కేవలం విష్ణు మాత్రమే ఒక వీడియో ని విడుదల చేసి మంచు ఫ్యామిలీ లో అంతా బాగానే ఉంది.

కావాలనే మేము గొడవ పడ్డాం అంటూ చెప్పే ప్రయత్నం చేయబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు విషయం ఏంటనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.సోషల్ మీడియా లో మంచు మనోజ్ ఇప్పటి వరకు తన అన్న విష్ణు విషయం లో పాజిటివ్ గా స్పందించలేదు.అంతే కాకుండా మొన్న జరిగిన గొడవ కేవలం ఫ్రాంక్ అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

కనుక ఇది గొడవే అని కాకుంటే మంచు మోహన్ బాబు( Mohan Babu ) ఆదేశాల మేరకు ఇమేజ్ డామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.పెద్ద ఎత్తున సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న మోహన్ బాబుకు ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం అభిమానులను కలచివేస్తోంది.

Advertisement

తాజా వార్తలు