ఇదేం విడ్డూరం.. థియేటర్‌కు వచ్చి ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్న వ్యక్తి.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో ఇండియన్ సిటీలకు సంబంధించి ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా బెంగళూరు వాసుల వీడియోలు, ఫొటోలు తరచుగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతాయి.

తాజాగా బెంగళూరుకు( Bangalore ) చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఒక వ్యక్తి సినిమా థియేటర్‌లో( Theatre ) కూర్చొని తన ల్యాప్‌టాప్‌ను యూజ్ చేస్తున్నట్లు కనిపించింది.

అతను సినిమా చూడటం లేదు, కానీ తన ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూ చాలా బిజీగా కనిపించాడు.కేపీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను తన ఫోన్ కెమెరాలో బందించాడు.

కేపీ స్వాగత్ ఓనిక్స్ థియేటర్‌లో( Swagath Onyx Theatre ) ఉదయాన్నే షో చూడటానికి వెళ్ళాడు.కేపీ హాల్‌లోకి రాగానే ల్యాప్‌టాప్‌లో( Laptop ) పని చేస్తున్న వ్యక్తిని చూసి రికార్డు చేశాడు.

Advertisement

కేపీ వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ "ఎర్లీ మార్నింగ్ షో విజువల్. ఇది కచ్చితంగా బెంగళూరు.

” అని క్యాప్షన్ జోడించాడు.

ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.వారిలో కొందరు ఆ వ్యక్తి ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేశారు.సినిమా థియేటర్‌లో కాకుండా పార్కులోనో, గార్డెన్‌లోనో ఎందుకు పని చేయలేదని ప్రశ్నించారు.

అయితే అతనికి ఏదో అత్యవసరమైన పని ఉండవచ్చని కేపీ బదులిచ్చారు.“ఇది ఉదయం 4 గంటల ప్రదర్శన, షో తర్వాత ఆఫీసుకు( Office ) లాగిన్ చేయడానికి ముందు కొన్ని క్విక్ మెయిల్ రిప్లై లేదా పెండింగ్‌లో ఉన్న చిన్న పనులు అతడు చేస్తూ ఉండొచ్చు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)

నాకు తెలియదు, జస్ట్ అలా అనుకుంటున్నాను అంతే" అని కేపీ రిప్లై ఇచ్చాడు.

Advertisement

మరికొందరు మనిషి పని తీరు గురించి చమత్కరించారు.ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తిని( Narayana Murthy ) వారు ప్రస్తావించారు.వారానికి 70 గంటలు పని చేయాలని మూర్తి ప్రజలకు సూచించారు.

అదే మాట ఇతను ఫాలో అవుతున్నాడేమో అని కొందరు ఫన్నీగా అన్నారు.ఇకపోతే కొన్ని నెలల క్రితం, ఒక మహిళ బైక్‌పై వెళుతూ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కెమెరాకి చిక్కింది.

ఆమె డ్రైవర్ వెనుక కూర్చుని తన ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తోంది.ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది.

తాజా వార్తలు