వీడియో: ఇదెక్కడి ఫన్నీ కాస్ట్యూమ్.. చూస్తే నవ్వాగదు..

సోషల్ మీడియాలో చాలామంది క్రియేటివ్ పీపుల్ కనిపిస్తుంటారు.వారు చేసే కొన్ని క్రియేటివ్ వర్క్స్( Creative Work ) మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక వ్యక్తి ట్రైన్ లో( Train ) ఒక డోర్ కు ఆనుకొని ముఖం నేలకేసి తూలుతూ కనిపిస్తాడు.

అతడు బాగా తాగాడు, అందుకే అలా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.డ్రింక్ చేయడంలో వింత ఏం లేదు కానీ ఇతడు వేసుకున్న వెరైటీ కాస్ట్యూమ్ చాలామంది దృష్టిని ఆకర్షించింది.

ఆ కాస్ట్యూమ్ అతడిని మోస్తున్నట్టుగా మనకి భ్రమ కలిగిస్తోంది.

Advertisement

అతడు బాగా డ్రింక్ చేసి ఉండగా, తనని తాను మూసుకోలేకపోతుండగా, కార్టూన్ కాస్ట్యూమ్( Cartoon Costume ) అతనిని తన భుజాలపై ఎక్కించుకొని మోస్తున్నట్లు కనిపించింది.ఈ దృశ్యాలు చూసేందుకు చాలా ఫన్నీగా అనిపించాయి.నిజానికి ఆ వ్యక్తి తన కాళ్ళను ముందుకు నడిపిస్తూ బాడీను వెనక్కి ఉంచుతూ ఉన్నాడు.

కాస్ట్యూమ్ తనని ముందుకు తీసుకెళ్తుంటే తాను రాను అని మారం చేసినట్లు కనిపించేలా అతడు నడుస్తున్నాడు.అందువల్ల ఈ విజువల్స్ నమ్మేలాగా అనిపించాయి.

ట్రైన్ లో కూర్చున్న ఒక వ్యక్తి అతనిని వీడియో రికార్డు చేశాడు.ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమై విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఇలాంటి కాస్ట్యూమ్( Costume ) నువ్వొస్తానంటే నేనొద్దంటానా హీరో సిద్ధార్థ కూడా వేసుకుంటాడు.

చాలామంది ఇతరులు కూడా వీటిని ధరించి రోడ్లపై తిరుగుతూ చిన్నపిల్లలతో పాటు పెద్ద వారిని కూడా ఆకర్షిస్తుంటారు.ఇకపోతే షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 34 వేలకు వ్యూస్ వచ్చాయి.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?

దీన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.మీరు కూడా దీనిపై ఒక లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు