వైరల్: మెట్రోలో ఏకంగా పరుపు వేసుకుని నిద్రపోతున్న వ్యక్తి... ఆశ్చర్యంలో ప్యాసింజర్లు!

విచిత్రం ఏమిటోగాని, దేశంలోని వింత వింత మనుషులందరూ రాజధాని ఢిల్లీలోనే ఉంటారెందుకని? అని జనాలు అడుగుతున్నారు.

ఎందుకంటే ఇపుడు ఎవరూ చేయని వింత వింత పనులు చేసి సెలిబ్రిటీలు అయిపోవడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేయడం.

బాగా ఎక్కువైపోయాయి.సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఇలాంటి స్టఫ్ ఎక్కువైపోయింది.

సాధారణంగా చాలా రష్ గా ఉన్నప్పుడు కూర్చోవడానికే చోటు దొరకని మెట్రోలో ఓ వ్యక్తి పరుపు వేసుకుని మరీ నిద్రపోవడం ఇప్పుడు వైరల్ మారింది.

Man Slept On Bed In Moving Metro Details, Viral Latest, News Viral, Social Media

అవును, దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో ఈ సంఘటన చోటుచేసుకోవడం విశేషం.ఢిల్లీ మెట్రోలో( Delhi Metro ) రోజుకో వీడియో వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.ఆమధ్య కాలంలో ఓ అమ్మాయి వేసుకున్న వస్త్రధారణపై సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరగడం మరిచిపోకముందే ఈ సంఘటన వెలుగు చూసింది.

Advertisement
Man Slept On Bed In Moving Metro Details, Viral Latest, News Viral, Social Media

ఆ మెట్రోలో జరిగిన ఓ సంఘటన బయటకు రావడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.నిలబడటానికే చోటు దొరకని మెట్రోలో ఓ కుర్రాడు బెడ్ పరుచుకుని మరీ నిద్రపోయాడు.ప్రిన్స్ జీ( Princezee ) అనే కుర్రాడు వింత ప్రవర్తన చూసి తోటి ప్యాసింజర్లు నవ్వుకున్నారు.

Man Slept On Bed In Moving Metro Details, Viral Latest, News Viral, Social Media

ఆ కుర్రాడు తన వెంటన ఓ బెడ్ ను తెచ్చుకొని నెమ్మదిగా దానిని పరుచుకుని బెడ్ పై ప్రశాంతంగా నిద్రపోయాడు.అంతమంది చూస్తున్నా ఏ మాత్రం బెరుకులేకుండా అతను బెడ్ పరుచుకుని పడుకున్న విధానం చూసి తోటి ప్రయాణికులు అయితే బిత్తరబోయారు.ఈ వీడియో క్లిప్ ప్రిన్స్ జీ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ క్రమంలో మెట్రోలో ఇలాంటివి జరుగుతుంటే జనం పట్టించుకోరేంటి? అని కొందరు.ప్రశ్నిస్తుంటే, అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

కాగా కొంతమంది అతగాడు కావాలనే అలా చేసాడని, కేవలం తన యూట్యూబ్ ఛానల్ కోసమే అలా చేసాడని కామెంట్స్ పెడుతున్నారు.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు