మేల్ ఇన్నెర్స్ ఆర్డర్ చేస్తే.. ఫిమేల్ ఇన్నెర్స్ పంపించిన బ్లింకిట్.. చివరికి..?

ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ డెలివరీ అంటూ కేవలం 10 నిమిషాలలో మీరు ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకువచ్చేందుకు అనేక కంపెనీలు సేవలను అందిస్తున్నాయి.

గుండు పిన్నిసు నుంచి ఏదైనా పెద్ద వస్తువు వరకు ఏదైనా సరే.

కేవలం పది నిమిషాల్లో సర్వీసు అందిస్తున్నాయి అనేక సంస్థలు.ఇలాంటి సేవలో పేరుగాంచిన బ్లింకిట్( Blinkit ) కూడా మిగతా ఆన్లైన్ డెలివరీ సర్వీస్లలాగే కొన్నిసార్లు పొరపాట్లు చేస్తోంది.

అదెలా అంటే ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువును పంపించడంలాగా.తాజాగా ఓ వ్యక్తి బ్లింకిట్ యాప్ ద్వారా మగవారికి ఉపయోగపడే అండర్వేర్లను( Underwears ) ఆర్డర్ చేయగా అతనికి మాత్రం ఆడవారు వేసుకుని ప్యాంటీస్ ను( Panties ) పంపించింది.

దీంతో షాక్ అయిన సదరు కస్టమర్ రిఫండ్ కోసం అడుగుతే అది కుదరలేదు.

Advertisement

చివరికి ఎవరు ఊహించని విధంగా అతడు సోషల్ మీడియాలో విషయాన్నీ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.హిమాచల్ ప్రదేశ్ నివాసి ప్రియాంష్( Priyansh ) బ్లింకిట్ ద్వారా జాకీ మేల్ అండర్వేర్లను ఆర్డర్ చేశారు.

అలా ఆర్డర్ చేసిన వెంటనే కొద్ది సమయంలో ఆర్డర్ బ్రౌన్ కలర్ బ్యాగులో చుట్టి వచ్చింది.వచ్చిన ఆర్డర్ ను తెరిచి చూడగా ఆయన మైండ్ బ్లాంక్ అయింది.

తాను మగవారికి ఉపయోగపడే అండర్వేర్లను ఆర్డర్ చేస్తే.దానికి బదులుగా మహిళల లోదుస్తులు పంపించింది.

అయితే అక్కడ అదే కంపెనీకి సంబంధించిన లోదుస్తులు వచ్చాయి.కాకపోతే, అవి మహిళలవి.అయితే ఈ విషయంపై కంపెనీ రిఫండ్ ఇవ్వడానికి నిరాకరించిందని సదరు కస్టమర్ తెలిపారు.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

అయితే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అతడు నిర్ణయించుకుని ఆ లేడీస్ పాంటిస్ ను వేసుకొని మరోసారి ఫోటో తీసి అందులో ఒక బ్లాక్ పాంటిస్ మిస్ అయింది అది ఎక్కడికి పోయిందో అనుకుంటున్నారు కదా.అది ఎక్కడికి పోలేదు దాన్ని నేనే వేసుకున్నానని ట్వీట్ చేశాడు.దీంతో అనేకమంది సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా వార్తలు