విషసర్పాలను విసిరేస్తున్న వ్యక్తి.. చూస్తే ఒళ్లు జలదరిస్తుంది..

మనకు సమీపంలో ఏదైనా పాము ( Snake )కనిపిస్తే వెంటనే వెన్నులో వణుకు పుడుతుంది.అక్కడి నుంచి వెంటనే పారిపోతాం.

కొందరు ధైర్యవంతులు వాటిని కర్రతో కొట్టి చంపేస్తారు.పాములు పట్టే వారైతే( Snakes Catcher ) నేర్పుగా వాటిని పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేస్తారు.

అయితే ఒకేసారి పదుల సంఖ్యలో పాములు మీ ముందు ఉంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా అక్కడి నుంచి పరుగులు పెడతారు.పాములు పట్టే వారైనా, ఎంత ధైర్యవంతులైనా ఎక్కువ సంఖ్యలో పాములను ఒకే చోట చూసినప్పుడు కాస్త వెనుకంజ వేస్తారు.

అయితే ఓ వ్యక్తి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు.రోడ్డుపై లెక్కకు మించి ఉన్న పాములను కేవలం చేతితోనే తీసి పక్కకు విసిరేశాడు.

Advertisement

నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.పామును ఎవరైనా చేతితో పట్టుకుంటే దానికి ఖచ్చితంగా కోరలు తీసేసి ఉంటుంది.

అయితే విషపూరిత పాముల జోలికి వెళ్లడానికి ఎవరైనా జంకుతారు.ఏ మాత్రం అది కాటు వేసినా ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి.

అయితే ఓ ఘాట్ రోడ్డులో( Ghat Road ) అకస్మాత్తుగా పాములు అధిక సంఖ్యలో వచ్చాయి.అయితే ఓ వ్యక్తి వాటిని కేవలం చేతితో పట్టుకుని పక్కకు విసిరేశాడు.

ఆ వ్యక్తి పాములను ఒట్టి చేతులతో ఎత్తుకెళ్లి సమీపంలోని పొలాల్లో విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

రోడ్డుకు ఒకవైపున పాములు ఉండడం వీడియోలో మనం గమనించవచ్చు.ఘాట్ రోడ్డులో రహదారి ఫెన్సింగ్ అటువైపుకు ఆ వ్యక్తి దూకాడు.తర్వాత ఒక్కొక్కటిగా పాములను తన చేతితోనే తీశాడు.

Advertisement

ఆశ్చర్యకరంగా వాటిని కిందికి విసిరేశాడు.అతడికి ఎలాంటి హాని కలగలేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో చూడగానే చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

అయితే విషపూరిత పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

తాజా వార్తలు