నిన్న అంటే జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యోగా దినోత్సవాన్ని( International Yoga Day ) ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.
అలానే చాలా మంది తాము చేసిన యోగాసనాలను ( Yoga ) వీడియోల రూపంలో సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.
ఇవి వైరల్‌గా కూడా మారాయి.వీటి మధ్య ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది.
ఎందుకంటే ఇందులో ఒక యువకుడు చాలా వెరైటీగా యోగా సాధన చేశాడు.నిజానికి అతడు ప్రమాదకర రీతిలో ఆసనాలు వేశాడు.
ఏమాత్రం తేడా వచ్చినా అతడు నేరుగా కాటికి పోయే ప్రమాదం ఉంది.అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేక్కడి పైత్యం అయ్యా సామీ అంటూ అతనికి సున్నితంగా చివాట్లు పెడుతున్నారు.
సాధారణంగా యోగాసనాలు ఎవరైనా ఇంట్లో లేదా యోగా సెంటర్లో వేస్తారు.ఇక వర్కౌట్స్ జిమ్‌లో లేదా ఇంట్లో, ఆరు బయట చేస్తారు.కానీ వైరల్ వీడియోలో కనిపించిన యువకుడు మాత్రం రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై పుషప్స్ చేశాడు.
తర్వాత యోగాసనాలు వేశాడు.ఈ విచిత్ర సంఘటన ఒడిశాలోని( Odisha ) బోలంగీర్ జిల్లాలో వెలుగు చూసింది.
వైరల్ వీడియోలో ఆ యువకుడు అలా డేంజరస్ ప్రదేశంలో వర్కౌట్ చేస్తుంటే కింద రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయంతో వణికిపోయారు.అతడు ఎక్కడ కింద పడతాడేమోనని వారు స్టన్ అయిపోయి అలాగే చూశారు.
వీడియోలో చూసినట్లుగా ఆ సైన్ బోర్డు ఇంచుమించు ఒక అడుగు వెడల్పు ఉండి ఉంటుంది.దీనిపై చేయి జారినా లేదా కాలు జారినా చాలా ఎత్తు పైనుంచి కింద పడిపోతాడు.అదే జరిగితే కాలో, చేయో విరగడం ఖాయం.
ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది.అందుకే వాహనదారులు సదరు యువకుడికి ఏం జరుగుతుందా అనే భయంతో అక్కడే నిలిచిపోయి మరీ చూశారు.
అతడు సురక్షితంగా కిందికి దిగాడా లేదా అనేది తెలియ రాలేదు.ఏదేమైనా ఇలాంటి పిచ్చి పనులు చివరికి విషాద ముగింపుకి దారితీస్తాయి కాబట్టి వీటిని ఎవరూ ట్రై చేయకూడదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy