ప్రపంచం వాహనరంగంలో ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే.బహుశా వాహనాలు లేని ఇల్లు చాలా తక్కువ.
ప్రతి ఇంట్లో బైక్, కార్ ఉండడం కామన్ గా మారిపోయింది.ఇక నగరాలలో అయితే వాహనదారులకు పార్కింగ్ ( Car Parking ) సమస్యలు చాలా ఎక్కువ.
వర్షం, ఎండ, దుమ్ము లాంటి కారణాలవల్ల నో పార్కింగ్ స్థలాలలో కార్ పార్క్ చేస్తే తరచూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఒక వ్యక్తి తరచూ జరిమానాలు కట్టలేక కాస్త విన్నుతం గా ఆలోచించి ఇంటిపైనే కార్లను పార్కింగ్ చేశాడు.
అసలు ఇంటి పైకి కారు ఎలా వెళ్తుంది.? ఇంటిపై కారు పార్క్ చేసిన ఆ యజమాని ఎవరు అనే వివరాలు చూద్దాం.
తైవాన్ లోని( Taiwan ) తైచుంగ్ లో ఓ సివిల్ ఇంజనీర్ తన రెండు పాత వ్యాన్లను ఇంటి బయట వీధిలో పార్క్ చేసినందుకు జరిమానా విధించబడింది.ఇలా తరచూ ఆ వాహనాలపై పడే చలాన్లు కట్టలేక విస్తూపోయి తన ఇంటి పైకప్పు పై( Rooftop ) పార్క్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఇక ఒక క్రేన్ ను అద్దెకు తీసుకొని దాని సహాయంతో వ్యాన్లను ఇంటి పైకి ఎక్కించి పార్క్ చేసేవాడు.
ఒక వ్యాన్ టెర్రస్ పైన మరొక వ్యాన్ టెర్రస్ గోడకు సగం ఆనుకొని ఉండేలా పార్కింగ్ ప్లాన్ చేశాడు.చుట్టుపక్కల వారంతా ఈ పార్కింగ్ ను గమనించి కాస్త భయాందోళనలకు గురై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ అధికారులు ఆ వ్యాన్లను ఇంటి పైనుంచి దించాలని ఆ యజమానిని కోరారు.అయితే ఆ వ్యక్తి తాను ఎటువంటి చట్టాలను ఉల్లంఘించడం లేదని చెప్పాడు.పైగా భవనం ఉక్కు ఇంకా కాంక్రీట్ తో నిర్మించబడింది కాబట్టి రెండు వాహనాల బరువు కు కూడా సపోర్ట్ చేస్తుంది అని యజమాని తెలిపాడు.
ఈ పార్కింగ్ తో భవనం పై ఎటువంటి ప్రభావం పడదని చెప్పాడు.అధికారులు కూడా ఆ యజమాని ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలుపుతూ చుట్టుపక్కల ఉండే ప్రజల భద్రత కోసం ఇంటి పైనుంచి వ్యాన్లను కిందకు దించాలని ఆ యజమానిని కోరారు.
ప్రస్తుతం ఈ పార్కింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy