ప్రేమ…రెండు అక్షరాలు…కాని లక్షణాలు మాత్రం లక్షల్లో ఉంటాయి.గాల్లో తేలిపోవడం, చందమామ ని అందుకోవడం…ఇలాంటివి ఎన్నో.
పగలంతా ఊహల్లో, రాత్రంతా కలల్లో బతుకుతూ ఉంటారు.పగలు, రాత్రి తేడా లేకుండా వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ ఉంటారు.
టైం అనేది మర్చిపోతారు.రోజుకి 24 గంటలు ఉన్నా.
ఇంకో గంట ఉంటె బాగుండు అనుకుంటారు లవర్స్.అదే వారిద్దరూ విడిగా ఉంటే ఒక రోజు ఒక యుగంలా గడుస్తుంది వారికి.
బంగారం, బుజ్జి, కన్నా.ఇలా ఎన్నో కొత్త పదాలు పరిచయం అవుతాయి లవర్స్ కి.
అలాంటిది ఈ ప్రేమ ఎప్పుడు ఎవరికీ ఎవరి మీద పుడుతుందో తెలీదు.అలాగే ఓ యువకుడు రైల్లో చూసిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.ల్లో కనిపించిన ఓ అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించేశాడు.
రెండు గంటల ప్రయాణంలో రెండు జతల కళ్లు చెప్పుకున్న ఊసులు.అతడి మనసును మాయచేశాయి.
మాట కలిపేలోపే.‘గమ్యం’ గమ్మత్తు చేసింది.
ఆమె దిగాల్సిన ఊరు రావడంతో రైలు దిగి వెళ్లిపోయింది.వెళ్తూ.
వెళ్తూ.చిరునవ్వు వదిలి వెళ్లింది.
అంతే, అప్పటి వరకు మనసులో రేగిన అలజడి ఉప్పెనయ్యింది.ఆమె కోసం వెతుకుతూ ఊరి నిండా పోస్టర్లు వేసాడు.
వివరాలలోకి వెళ్తే.అతని పేరు విశ్వజిత్.29 ఏళ్ల ఈ యువకుడు కోల్కతాలోని సాల్ట్‌లేక్‌లో రాష్ట్ర పర్యావరణ శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.జులై 23న విశ్వజిత్ ఇంటికి వెళ్లేందుకు లోకల్ రైలు ఎక్కాడు.
ఆ అమ్మాయి కూడా తన తల్లిదండ్రులతో కలిసి అదే రైలు ఎక్కి, అతని ఎదురుగా కూర్చుంది.ఆమెను చూసిన వెంటనే విశ్వజిత్‌లో అలజడి రేగింది.ఏదో గంట మోగుతున్న ఫీలింగ్ (సినిమా స్టైల్‌లో).
అంతే, కళ్లు తెలియకుండానే ఆమెను చూస్తుండిపోయాయి.ఆ చూపులు దాటికి ఆమె ఇబ్బందిగా ఫీలనట్లు అనిపించి.
విశ్వజిత్ ఆమెను చూడటం మానేశాడు.అయితే, మాయదారి మనసు ఊరుకుంటుందా? మళ్లీ ఆమెను చూడాలని ప్రేరేపించింది.దీంతో విశ్వజిత్ ఆమెను మళ్లీ చూశాడు.
ఆమె కూడా విశ్వజిత్‌ను చూడటం మొదలుపెట్టింది.ఇంకేం ఉంది, దాదాపు రెండు గంటల ప్రయాణంలో చూపులు ఎక్స్‌ఛేంజ్ అయ్యాయి.విశ్వజిత్ ఒక అడుగు ముందుకేసి.
ఎక్కడి వరకు అని ఆమె తల్లిదండ్రులతో మాట కలిపాడు.కొన్నాగర్‌లో దిగుతామని వారు సమాధానం చెప్పారు.
అయితే, కొన్నాగర్‌లో ఎక్కడు ఉంటారని అడిగే ధైర్యం చేయలేక.ఊరుకున్నాడు.
అంతలో ఆమె దిగాల్సిన రైల్వే స్టేషన్ రానే వచ్చింది.రైలు దిగుతూ ఆమె విశ్వజిత్ మీద నుంచి చూపు తిప్పలేదు.
ఆమె నోటితో ఏదో చెబుతోంది.అయితే, మనోడు మౌత్ రీడింగ్‌లో పూర్.
ఆమె ఫోన్ నెంబరు చెబుతోందా? వాళ్లు ఉంటున్న ప్రాంతం పేరు చెబుతోందా అని కన్ఫ్యూజన్.గట్టిగా అడుగుదామంటే ఆమె తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు.
దీంతో ధైర్యం చేయలేకపోయాడు.మొత్తానికి మనోడికి ఆమె కూడా ప్రేమిస్తుంది అని అర్ధమైంది.
ఆమెను ఎలాగైనా కలవాలని నిర్ణించుకున్నాడు.మరి ఎలా? ఆమె నివసిస్తున్న ఊరిలో స్నేహితులు గానీ, బందువులు గానీ ఎవరూ లేరే? అని ఆలోచించాడు.దీంతో.
రోడ్డు పక్కన గోడపై పోస్టర్ కనిపించింది.వెంటనే బుర్రలో ఐడియా మెదిలింది.
అనుకున్నదే తడవుగా.ఆ రోజు ఆమెను కలుసుకున్నప్పడు వేసుకున్న టీ షర్ట్ -జీన్స్‌తో ఫొటోలు తీయించుకుని.4 వేల పోస్టర్లు సిద్ధం చేశాడు.వాటిలో అతడి ఫోన్ నెంబరుతో పాటు ‘యూట్యూబ్’లో ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కొన్నాగరర్ కొనే’ (అంటే కొన్నగర్ పెళ్లికూతురు) వీడియో లింక్ పెట్టాడు.
అయితే, ఆ పోస్టర్లు చూసి తప్పకుండా ఆమె తనకు ఫోన్ చేస్తుందని విశ్వజిత్ నమ్ముతున్నాడు.మరి అతని లవ్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy