Kotamreddy Srinivasulu Reddy: టిడిపి సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీ కొట్టి పరారైన యువకుడు..

నెల్లూరు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ని కారుతో ఢీ కొట్టాడు నాగ వెంకట శేఖర్ రెడ్డి అనే యువకుడు.

శ్రీనివాసులు రెడ్డి కుమారుడికి గతంలో స్నేహితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు మత్తు పదార్థాలు సేవించి శ్రీనివాసులు రెడ్డి నివాసానికి వచ్చి అసభ్య పదజాలంతో శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడిని దూషించాడు.

దీంతో ఆగ్రహానికి గురైన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆ యువకుడిని మందలించే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి నేరుగా కారెక్కి శ్రీనివాస్ రెడ్డిని కారుతో ఢీకొట్టాడు.దీంతో కాలికి తీవ్ర గాయాలు కావడంతో కాలు విరిగగింది.

వెంటనే అక్కడే ఉన్న స్థానికులు, టిడిపి నేతలు అపోలో ఆసుపత్రికి తరలించి ఆయనకి చికిత్స అందిస్తున్నారు.కాగా టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకొని శ్రీనివాసులరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి సమాచారం తెలుసుకున్నారు.

అయితే నెల్లూరు మత్తు పదార్థాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇలా కారుతో శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టడం దారుణం అన్నారు.

Advertisement

నెల్లూరులో గంజాయి, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని, యువత దానికి బానిసలుగా మారిపోతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రస్తుతం శ్రీనివాసులు రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని, కాలు విరగడంతో కొద్దిరోజులు చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు