QR Code on Forehead : తల మీద క్యూఆర్ కోడ్‌ను టాటూగా వేయించుకున్న వ్యక్తి.. నెటిజన్లు షాక్..!

సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మిమ్మల్ని షాక్‌కి, గందరగోళానికి గురిచేస్తాయి.

అలాంటి ఒక షాకింగ్ వీడియో తాజాగా వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి నుదిటిపై క్యూఆర్ కోడ్ టాటూ వేయించుకున్నాడు.వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం.

ముఖంపై క్యూఆర్ కోడ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ.అయితే మీరు ఈ వైరల్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.QR కోడ్( QR Code ) అనేది స్మార్ట్‌ఫోన్ లేదా కెమెరా ద్వారా స్కాన్ చేయగల బార్‌కోడ్ అనే సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే దీని ద్వారా మరింత మంది ఫాలోవర్లను సంపాదించాలని వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భావించాడు.ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వ్యక్తి QR కోడ్ టాటూ( QR Code Tattoo ) అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు లింక్ చేశాడు.

Advertisement

తద్వారా మరింతమంది అటెన్షన్, ఫాలోవర్లను ఆకర్షిస్తానని భావిస్తున్నాడు.

ఆ వ్యక్తి టాటూ ఎలా వేయించుకున్నాడో వీడియోలో కనిపించింది.అతను బెడ్‌పై పడుకుని ఉండగా టాటూ ఆర్టిస్ట్‌ అతడి నుదిటిపై సూది, సిరాతో క్యూఆర్ కోడ్‌ను టాటూ కదా వేస్తాడు.మనిషి నొప్పితో ఉన్నట్లు కనిపిస్తున్నాడు, కానీ కదలడు లేదా ఫిర్యాదు చేయడు.

టాటూ ఆర్టిస్ట్ QR కోడ్‌ని పూర్తి చేసి, ఆపై దానిని పరీక్షిస్తాడు.అతను తన ఫోన్‌తో మనిషి నుదిటిని స్కాన్ చేస్తాడు, అంతే అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్( Instagram Account ) ఓపెన్ అవుతుంది.

ఈ విచిత్ర వ్యక్తితో పాటు, టాటూ ఆర్టిస్ట్ కెమెరాను చూసి నవ్వుతూ వీడియో ముగిస్తారు.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?

ఈ వీడియో ఫిబ్రవరి 26న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయి 17 లక్షల వ్యూస్‌ సంపాదించింది.దీనికి 9,000 పైగా లైక్‌లు, అనేక కామెంట్లు కూడా వచ్చాయి.కొంతమంది పచ్చబొట్టు పొడిపించుకోవడం తెలివైన ఐడియా అని కామెంట్లు చేశారు, మరికొందరు ఇది ఫేక్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

ఏది ఏమైనా ఈ వీడియో అందర్నీ నోరేళ్లబెట్టేలా చేస్తోంది.

తాజా వార్తలు