300 అడుగుల ఎత్తు.. గాలి మరపై తలకిందులుగా వేలాడుతూ నరకం.. చివరకు ఓ అద్భుతం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్‌లోని( Andhra Pradesh ) అనంతపురం జిల్లాలో( Anantapur District ) ఊహించని ప్రమాదం జరిగింది.

నింబగల్లు గ్రామంలోని ఓ గాలిమరను( Wind Turbine ) బాగుచేస్తుండగా సుందరేశన్( Sundaresan ) అనే కార్మికుడు తృటిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

దాదాపు 300 అడుగుల ఎత్తులో గాలిమర మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయాడు సుందరేశన్.అంతే, గుండె ఆగినంత పనైంది.

కానీ ఆపై అద్భుతం జరిగింది.ప్రాణాల్ని కాపాడే ఇనుప తాడు అనుకోకుండా అతని కాలికి చుట్టుకుంది.

పుటుక్కుమని ఆగిపోయాడు.తలకిందులుగా గాలిలో వేలాడుతూ నరకం చూశాడు సుందరేశన్.

Advertisement

దాదాపు గంటకు పైగా అతను అలాగే గాల్లో ఊగుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాడు.ఆ ఇనుప తాడు( Iron Rope ) ఒక్క క్షణం ఆలస్యంగా పడినా అంతే సంగతులు, నేరుగా నేలకేసి కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసేవాడు.అదృష్టం కొద్దీ గాలిమర నిర్మాణంలో ఉన్న ఇనుప ఊచలు, సందుల వల్ల తాడు గట్టిగా బిగుసుకుపోయింది.

ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు, తోటి కార్మికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ నిజమైన హీరోలా రంగంలోకి దిగాడు.

మరో ఇనుప తాడు సాయంతో గాలిమర పైకి దిగి సుందరేశన్‌ను చేరుకున్నాడు.

చాలా జాగ్రత్తగా, ఓపికగా సుందరేశన్ కాలికి బిగుసుకుపోయిన తాడును విడిపించాడు రవికుమార్.కింద ఉన్న రెస్క్యూ టీమ్ సహాయంతో సురక్షితంగా సుందరేశన్‌ను కిందకు దించారు.రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

సుందరేశన్ ఎప్పుడు కింద పడిపోతాడో అని భయంతో రెస్క్యూ టీమ్ ముందు జాగ్రత్తగా గాలిమర కింద పెద్ద సేఫ్టీ నెట్ కూడా ఏర్పాటు చేసింది.అదృష్టవశాత్తు అది ఉపయోగించాల్సిన అవసరం రాలేదు.

Advertisement

సుందరేశన్‌కు గాయాలయ్యాయి కానీ ప్రాణాలతో బయటపడ్డాడు.ఇనుప తాడు, రవికుమార్ సాహసం, రెస్క్యూ టీమ్ సమయస్ఫూర్తితో సుందరేశన్ ప్రాణాలు నిలిచాయి.

తాజా వార్తలు