ప్రజావాణిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి కలెక్టరేట్ లో ఓ వికలాంగుడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి జరుగుతుండగా కలెక్టర్, జేసీల ఎదుటే ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

అక్కడున్న వారు అప్రమత్తమై అతనిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.అతను భువనగిరి రూరల్ మండలం హనుమాపురం గ్రామానికి చెందిన యాదగిరి అనే వికలాంగుడుగా గుర్తించారు.

తనకు కాలు లేదని,వికలాంగ పెన్షన్ ఇవ్వాలని ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా పెన్షన్ ఇవ్వడం లేదని, చేసేదేమీ లేక ఆత్మహత్యయత్నం చేసినట్లు బాధితుడు వాపోయాడు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News