కరోనా సోకిందని శ్మశానానికి వెళ్లాడు... ఆ తరువాత ఏం జరిగిందంటే..?

కరోనా.ఈ పేరు వింటే చాలు.

జీవితంలో దేనికీ భయపడని వ్యక్తులు కూడా విపరీతంగా భయాందోళనకు గురవుతున్నారు.తాజా తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.

చిత్తూరు జిల్లాలోని తొట్టెంబేడులో కరోనా సోకి ఉండొచ్చని అనుమానంతో నిన్న అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి ఒక వ్యక్తి తన తల్లి సమాధి పక్కనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పూర్తి వివరాలలోకి వెళితే తొట్టెంబేడులోని అరుంధతివాడకు చెందిన బాలకృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధ పడుతున్నాడు.

తాజాగా మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోగా వైద్యులు బాలకృష్ణకు నోటి అల్సర్ ఉందని మరియు మూత్ర సంబంధిత వ్యాధి ఉందని చెప్పారు.కానీ మానసిక స్థితి సరిగ్గా లేని బాలకృష్ణయ్య మాత్రం తనకు కరోనా వైరస్ సోకిందని అందువలనే ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయని భావించాడు.

Advertisement

ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చిన తరువాత తనకు కరోనా వైరస్ సోకిందని తనను ఎవరూ ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు గ్రామంలోని ఇతర వ్యక్తులకు చెప్పాడు.ఆ తరువాత అర్ధరాత్రి సమయంలో శ్మశానానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం గురించి వైద్యాధికారిణి విచారణ జరిపి రిపోర్టులు పరిశీలించగా బాలకృష్ణన్ కు కరోనా సోకలేదని మానసిక స్థితి సరిగ్గా లేకనే బాలకృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది.విచారణ జరిపిన వైద్యాధికారి ఇదే నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు