వావ్, బాహుబలిలో ప్రభాస్ లాగా ఏనుగుపైకెక్కిన వ్యక్తి.. వీడియో వైరల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా వచ్చిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

ఇందులో ప్రభాస్ ఏనుగు నెక్కిన సీన్ ఒక హైలెట్ అని చెప్పవచ్చు.

ఈ సన్నివేశంలో ప్రభాస్ ని తన వీపు మీదకు ఎక్కించుకునేందుకు ఏనుగు తొండాన్ని కింద నుంచి పైకి లేపుతుంది.ఈ సీన్ స్క్రీన్ పై కనిపించినప్పుడు ప్రేక్షకులు మంత్రముగ్దులవుతుంటారు.

అయితే ఇప్పుడు ఈ సీన్ రియల్ లైఫ్ లో కూడా చోటు చేసుకొంది.అది చూసి నెటిజన్లు బాహుబలి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.

దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఈ వీడియో ని ఐపీఎస్‌ అధికారి దీపాంశు కబ్రా ట్విటర్‌లో షేర్ చేశారు.

Advertisement

ఈ వీడియోలో మావటి ఒక ఏనుగుపై స్వారీ చేయాలని అనుకుంటాడు.ఇందుకు అతను ఏనుగు ముందుకు వచ్చి నిలబడతాడు.

ఆ తర్వాత ఆ ఏనుగు మావటి కోసం తొండాన్ని కిందకి దించి అతన్ని తన వీపు మీదకి ఎక్కించుకుంటుంది.ఆ విధంగా ఈ మావటి ఏ సహాయం లేకుండానే ఏనుగు తొండం ద్వారా దాని మీదకి ఎక్కగలుగుతాడు.

ఇది అచ్చం బాహుబలి సినిమాలో లాగానే కనిపించింది.ఈ వీడియోకి 33 వేల వ్యూస్, 2 వేలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ బ్యూటిఫుల్ వీడియో ని మీరు కూడా చూసేయండి.మానవులు, మూగ జంతువుల మధ్య ఇలాంటి అనుబంధం చూసేందుకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఈ రాశుల వారికి పచ్చ రత్నం కలిసి రాదా..?
Advertisement