సాధారణంగా మనం ఎంత అయితే కరెంటు వాడుతామో అంతే బిల్లు వస్తుంది.చాలా మంది కరెంటు బిల్ల ఎక్కువగా వస్తుదని.
లైట్లు వేయకుండా, ఫ్యాన్లు నడపకుండా విద్యుత్ ను ఆదా చేస్తుంటారు.పని ఉన్నంత సేపు మాత్రమే విద్యుత్ ను ఉపయోగించుకొని ఆ తర్వాత స్విచ్ఛాప్ చేసేస్తుంటారు.
మధ్య తరగతి ఇళ్లల్లో అయితే చాలా మంది ఇలాగే చేస్తుంటారు.అయితే ఇలాంటి ఓ సాధారణమైన కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి కరెంటు బిల్లు ఎక్కువగా వచ్ిచంది.
దాన్ని చూసి ఖంగుతిన్నాడు.ఏం చేయాలో తెలియక హైడ్రామా చేశాడు.
ప్రమాదకర రీతిలో ఎలక్ట్రిక్ టవర్ పైకి ఎక్కి హల్ చల్ చేశాడు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కౌశాంబీ జిల్లా పురా గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన అశోక్ కుమార్.వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
మూడేళ్ల కింద సౌభాగ్య పథకం ద్వారా అతనికి విద్యుత్ కెనక్షన్ వచ్చింది.అప్పటి నుంచి క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాడు.
అయితే తాజాగా అతడికి 8 వేల 700 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది.దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు.
వెంటనే అతడి మానసిక పరిస్థితి దిగజారిపోయి. హై వోల్టేజీ విద్యుత్ టవర్ ను ఎక్కాడని అశోక్ భార్య మోహని దేవి తెలిపారు.
అయితే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.అతడికి నచ్చజెప్పి కిందకు దించారు.
పోలీసులు రాకపోయుంటే తన భర్త తనకు దక్కేవాడు కాదని మోహని దేవి తెలిపారు.దేవుళ్లలా వచ్చి తన భర్తను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy