రైలు ఎక్కుతూ జారిపడ్డాడు, ఐదు సెకన్లు ఆలస్యమతే పనైపోయేదే..!

బస్సులు వేగంగా వెళ్తున్నప్పుడు వాటి వెంట పడీ మరీ ఎక్కే వాళ్లను చాలానే చూసుంటాం.

అలాగే రైళ్లు పరిగెడుతుంటే కూడా పరిగెట్టి ఎక్కే వాళ్లను నిజ జీవితంలో కంటే సినిమాల్లోనే ఎక్కవగా కనిపిస్తుంటారు.

అయితే అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటు చేసుకుంది.వేగంగా వెళ్తున్న ఓ రైలు ఎక్కబోయి కింద పడిపోయాడో వ్యక్తి.

అయితే విషయం గమనించిన ఓ రైల్వే కానిస్టేబుల్ రంగంలోకి దిగాడు.సెకన్ల వ్యవధిలోనే పక్కకి లాగా అతడి ప్రాణాలు కాపాడాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.అసలీ ఘటన ఎక్కడ జరగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గాజియాబాద్ రైల్వే స్టేషన్ లో వేగంగా వెళ్తున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి పట్టు తప్పి అక్కడే కింద పడ్డాడు.అయితే పట్టాలపై పడి రైలు ప్రమాదానిగి గురవకుండా కాపాడాడు అక్కడి కానిస్టేబుల్.

సెకన్ల వ్యవధిలోనే అతడిని పక్కకి లాగాడు.లేకపోతే అతడి ప్రాణాలు కచ్చితంగా గాల్లో కలిసిపోయేవి.

పూర్ణగిరి జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కబోతుండగా.ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాలు చూస్తే తెలుస్తుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.ఆర్పీఎఫ్ సిబ్బంది చేసిన పనికి పలువురు నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

వీడియో చూసిన నెటిజెన్లు కానిస్టేబుల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ప్రాణాలకు తెగించి మరీ అంత వేగంగా వెళ్తున్న రైలు ఎక్కడం అవసరమా అని ప్రయాణికుడిపై కోప్పడుతున్నారు.

Advertisement