కాటేసిన పాముపై పగబట్టాడు.. నోటితో కొరికి చంపేశాడు!

పాములు మనుషులను కరవడం, పగ బట్టడం మనకు తెలిసిన విషయమే.మనల్ని అంటే మనుషులనే కాకుండా ఇతర జంతువులపై కూడా అవి అప్పుడప్పుడూ విషం చిమ్మతుంటాయి.

పాములు పగబట్టిన వారిని వెంట పడి వారి ప్రాణాలు తీసే వరకు వదలవని కూడా చాలా మంది భావిస్తుంటారు.ఇందుకు సంబంధించిన చాలా వార్తలు వచ్చాయి.

Man Bites A Bitten Snake In Odisha , Man Bites Snake, Man Viral Vedio, Snake Vid

అలాగే సినిమాలు కూడా చాలానే వచ్చాయి.కానీ మనం ఇప్పుడు వినబోయే, చూడబోయే ఘటన మాత్రం చాలా విచిత్రమైనది.

ఎప్పుడూ, ఎవరూ, ఎక్కడ విననది.అదేంటంటే ఓ వ్యక్తి పాముపై పగట్టాడు.

Advertisement

తనని కరిచిందన్న కోపంతో అతడు కూడా తన నోటితో దాన్ని కరిచి చంపాడు.అనంతరం ఆ పామును మెడలో వేసుకొని ఊరంతా తిరిగాడు.

విషయం గుర్తించిన కొందరు యువకులు దాన్ని వీడియో తీసి నెట్టింట పెట్టారు.పెట్టిన క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

అయితే అసలీ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఒడిషాలోని బాలేశ్వర్ దర్దా గ్రామానికి చెందిన సలీం ఖాన్ అనే వ్యక్తి మెడలో నాగు పాము వేసుకొని గ్రామంలో హల్ చల్ చేశాడు.

సలీం తన పొలంలో గడ్డి కోస్తుండగా.నాగుపాము అతడిని కాటు వేసింది.

స్కిన్ టోన్ రోజురోజుకు తగ్గిపోతుందా.. వర్రీ వద్దు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి!

దీంతో అతడు ఆ సర్పాన్ని పట్టుకొని నోటితో కొరికి మరీ చంపేశాడు.ఆపై ఆ చనిపోయిన పామును మెడలో వేసుకొని సైకిల్ పై షికార్లు చేశాడు.

Advertisement

తాజా వార్తలు