పెళ్లిలో కానుకల కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు.. షాక్ అవుతున్న అతిథులు..

భారతదేశమంతటా ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి.భారతదేశంలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడి షాపులు, ఆఫీసులు, దుకాణాల్లో క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది.

అంతగా ఈ డిజిటల్ చెల్లింపులు పాపులర్ అయ్యాయని చెప్పుకోవచ్చు.అయితే కాలం గడుస్తున్నా కొద్దీ నగదు రహిత ట్రాన్సాక్షన్లు క్యాష్ పేమెంట్స్ ని భర్తీ చేస్తున్నాయి.

తాజాగా ఒక పెళ్ళిలో చదివింపుల కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనం గా నిలుస్తోంది.ఇక పెళ్లి వేడుకలలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం చూసి అవాక్కవ్వడం అతిథుల వంతయింది.

ఒక ముస్లిం కుటుంబం ప్రస్తుత ట్రెండుకు తగినట్లు కాస్త వినూత్నంగా ఆలోచించి ఈ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు.వివరాల్లోకి వెళితే.

Advertisement
Man Arranges Qr Code In Marriage In Uttar Pradesh Details, Marriage, Marriage QR

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బస్తీ జిల్లా, భవ్య మ్యారేజ్ ప్యాలెస్‌లో ఓల్డ్ బస్తీకి చెందిన హాజీ పీర్ మహ్మద్ తన కుమార్తె అఫ్సా పెళ్లి జరిపించాడు.తాహిర్ అనే యువకుడి అఫ్సాను మ్యారేజ్ చేసుకున్నాడు.

Man Arranges Qr Code In Marriage In Uttar Pradesh Details, Marriage, Marriage Qr

ఈ పెళ్లి వేడుకలలోనే వధువు తండ్రి హాజీ పీర్ క్యూఆర్ కోడ్ పెట్టి చదివింపులు చదివికోవాల్సిందిగా కోరాడు.ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయగానే అవన్నీ కూడా కుమార్తె అకౌంట్లో డైరెక్ట్‌గా పడిపోయేటట్లు అతను ఏర్పాటు చేశాడు.క్యాష్ రూపంలో డబ్బులు ఇవ్వడం కాస్త శ్రమతో కూడుకున్న పని అని చెప్పవచ్చు.

చాలామంది ఎన్వలప్ కొని అందులో డబ్బులు పెట్టి చేతికి ఇస్తున్నారు.

Man Arranges Qr Code In Marriage In Uttar Pradesh Details, Marriage, Marriage Qr

వాటిని వధువు లెక్క పెట్టుకోవడానికి కూడా సమయం పడుతుంది.ఈ తతంగమంతా అవసరం లేకుండా వధువు తండ్రి సింపుల్ గా క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచాడు.దాంతో అతిథులందరూ అతడి ఐడియాను మెచ్చుకున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

ఇకపోతే రీసెంట్‌గా హైదరాబాద్‌లో సంక్రాంతి గంగిరెద్దుల తలకు క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులను వసూలు చేశారు.ఇలా ప్రజల ఆలోచనలతో భారత్ డిజిటల్ ఇండియా గా మారిపోతుంది.

Advertisement

తాజా వార్తలు