కాసేపటిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమావేశం

హైదరాబాద్ లోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన అనుచరులతో కీలక సమావేశం కానున్నారు.

ఇందులో భాగంగా ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సమావేశంలో భాగంగా మైనంపల్లి అనుచరుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే మైనంపల్లికి మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ అవకాశం కల్పించింది.తనయుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వాలని మైనంపల్లి డిమాండ్ చేయగా అధిష్టానం నిరాకరించింది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు.మరోవైపు మంత్రి హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మైనంపల్లిపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో మైనంపల్లి ఏ నిర్ణయం తీసుకోనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు