కథ రాయడం కోసం ఏకంగా ఆన్లైన్ క్లాసులు విన్న స్టార్ హీరో

సినిమా రంగంలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ రెండు గోల్స్ ఉంటాయి.అందులో ఒకటి దర్శకుడి అవతారం ఎత్తడం.

రెండోది హీరోగా సత్తా చాటాలి అనుకోవడం.ఈ రెండింటిలో ఏదో ఒకటి కావాలి అనుకుంటారు చాలా మంది.

సినీ రంగంలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం ఈ రెండింటి చుట్టే తిరుగుతుంది.ఎన్ని కష్టాలు పడ్డా ఫర్వాలేదు.

సినిమా దర్శకుడిగా మారాలి అనుకుంటారు ఎంతో మంది కుర్రాళ్లు.ఎన్నో ఇబ్బందులకు ఎదురు నిలబడి అనుకున్న దాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తారు.

Advertisement
Malayala Star Hero Listening Classes For Script , Malayala Star , Mohanlal, Mala

అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కూడా దర్శకత్వం పిచ్చి పట్టుకుంలో పడి ఎన్నో ఇబ్బందులు పడ్డాడట.ఇంతకీ ఆయనకు ఆ పిచ్చి ఎలా తగ్గిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు మోహన్ లాల్.సుమారు నాలుగు దశాబ్దాల పాటు లెజెండరీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఆయనకు దర్శకత్వం మీద ఇంట్రెస్ట్ కలిగిందట.

అనుకున్నదే ఆలస్యంగా బారోజ్ అనే సినిమాను ప్రారంభించాడు కూడా.ఈ సినిమాకు తను దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా కథ రివీల్ అయ్యింది.వాస్కోడిగామా కాలం నాటి కథను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అంతేకాదు.ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా తనే రాసుకున్నాడట.

Malayala Star Hero Listening Classes For Script , Malayala Star , Mohanlal, Mala
Advertisement

ఈ సినిమా స్ర్కీన్ ప్లే కోసం తను ఆన్ లైన్ స్ర్కీన్ ప్లే క్లాసులకు హాజరయ్యాడట.ఒక లెజెండరీ యాక్టర్ ఇలా క్లాసులకు అటెండ్ కావడం ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తుంది.అంతేకాదు తను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ కొత్త జంటకు అవకాశం ఇచ్చాడట.

ఈ జంటను ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక మోహన్ లాల్ విషయానికి వస్తే ఆయన తెలుగు జనాలకు సుపరిచితం.

జనగా గ్యారేజ్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు మరింత దగ్గర అయ్యాడు.ఆయన నటించిన పలు మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి కూడా.

తాజా వార్తలు