రౌడీ స్టార్‌కు ఓకే చెప్పి మాస్‌ రాజాకు నో చెప్పింది

తమిళం మరియు మలయాళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ మాళవిక మోహన్‌.ఈమెను తెలుగులో పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ హీరోగా హీరో అనే చిత్రాన్ని ఆమద్య ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు ఈమె ఓకే చెప్పింది.

కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కడం లేదు.అసలు సినిమా ప్రారంభం అయ్యేనో లేదో చెప్పలేని పరిస్థితి.

విజయ్‌ దేవరకొండ హీరో మూవీ దాదాపుగా క్యాన్సిల్‌ అయిన నేపథ్యంలో మాళవిక మోహన్‌ తెలుగు ఎంట్రీ లేనట్లే అని తేలిపోయింది.తాజాగా రవితేజ ఈ అమ్మడితో నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

Advertisement
Malavika Mohan Says No For Raviteja Movies, Ravi Teja, Vijay Devarakonda, Malaya

ఒక ప్రాజెక్ట్‌ కోసం ఈ అమ్మడిని చిత్ర దర్శకుడు సంప్రదించాడట.కాని రవితేజ పేరు చెప్పిన వెంటనే నో అనేశాడట.

దాంతో రవితేజకు మరో జోడీని వెతికే పనిలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

Malavika Mohan Says No For Raviteja Movies, Ravi Teja, Vijay Devarakonda, Malaya

రవితేజకు నో ఎందుకు చెప్పింది అనే విషయంలో ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది.తెలుగులో ఈ అమ్మడికి నటించేందుకు మంచి ఆఫర్లు వచ్చినా కూడా ఎందుకు నో చెబుతుంది.విజయ్‌ దేవరకొండతో నటించేందుకు ఒప్పుకున్న ఈమె రవితేజతో మాత్రం నటించేందుకు ఎందుకు నో చెప్పింది అంటూ కొందరు ఆలోచనలో పడ్డారు.

తమిళంలో ఈమె నటించిన మాస్టర్‌ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.ఆ సినిమా తర్వాత కొత్త సినిమాలకు కమిట్‌ అయితే ఎక్కువ పారితోషికం వస్తుందని ఈమె భావన కావచ్చు అంటున్నారు.

ఎండల వల్ల మీ ముఖం మెడ నల్లగా మారాయా.. ఈ రెమెడీతో 20 నిమిషాల్లో చర్మాన్ని రిపేర్ చేసేయండి!
Advertisement

తాజా వార్తలు