ప్రభాస్ దగ్గరుండి బిర్యాని తినిపిస్తారు... రాజాసాబ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన టాలెంట్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈయన డైరెక్టర్ మారుతి ( Maruthi ) దర్శకత్వంలో రాజా సాబ్( Rajasaab ) అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే  ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది అయితే ఇందులో హీరోయిన్గా మాళవిక మోహన్( Malavika Mohan ) కూడా నటిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాళవిక మోహన్ నటుడు ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.హీరో ప్రభాస్ కి తాను పెద్ద ఫ్యాన్ ఎప్పటినుంచో ఆయనతో కలిసి ఒక సినిమా చేయాలని కోరుకునేదాన్ని రాజాసాబ్  సినిమాతో ఆ కోరిక నెరవేరిందని తెలిపారు.మొదటిరోజు షూటింగ్ సమయంలో సెట్ లో ప్రభాస్ ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఆయన అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ అంత సింపుల్ గా ఎలా ఉండిపోతున్నారు అని ఆశ్చర్యపోయానని తెలిపారు.

ప్రభాస్ ఎక్కడుంటే ఆ ప్రదేశం మొత్తం చాలా కంఫర్టబుల్ గా ఉండిపోతుందని, ప్రతి విషయంలో కూడా ఆయన అందరిని చాలా మంచిగా సపోర్ట్ చేస్తారని తెలిపారు.ముఖ్యంగా సెట్‌లో ఉన్న టీమ్ మొత్తానికి మంచి ఫుడ్‌ పంపిస్తారు.దగ్గరుండి బిర్యాని తినిపిస్తారు.

Advertisement

మంచి కామెండీ టైమింగ్‌తో నవ్విస్తారని అన్నారు.నిజంగా ప్రభాస్ చాలా స్వీట్ అంటూ హీరో ప్రభాస్ పై మాళవిక మోహన్ ప్రశంశల వర్షం కురిపించారు.

అయితే ప్రభాస్ మంచితనం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తెలియచేయగా తాజాగా మాళవిక మోహన్ కూడా ప్రభాస్ పెట్టే ఫుడ్డు గురించి ఆయన మంచితనం గురించి మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు