అంతరిక్షం నుంచి పడిన ఉల్కతో పర్స్ తయారీ.. దీని ధర ఎంతంటే

మనకు అప్పుడప్పుడు అంతరిక్షం( space ) నుంచి ఉల్కలు పడే ప్రమాదం ఉందని వార్తల్లో వింటుంటాం.

వాటి సైజులు కొన్ని చిన్నవి గానూ, కొన్ని కిలోమీటర్ల పరిధిలో దాదాపు నగరం అంత పెద్దవిగానూ ఉంటాయి.

అయితే ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీపై పలు దేశాల శాస్త్రవేత్తలు( Scientists ) గణనీయమైన అభివృద్ధి సాధించారు.

ఈ తరుణంలో అంతరిక్షంలో జరిగే మార్పులు, ఉల్కలు పడే ప్రమాదాల గురించి తెలుసుకుంటున్నారు.పెద్దవి, ప్రమాదకరమైన వాటిని అంతరిక్షంలోనే కూల్చేస్తున్నారు.

భూమిపై పడకుండా, ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే చిన్నపాటి ఉల్కలు అక్కడక్కడా పడుతుంటాయి.

Advertisement

వాటితో అంతగా ప్రమాదం ఉండదు.గాలిలోనే అవి మండిపోయి భూమి మీదకు వచ్చే సమయానికి చిన్నవి అయిపోతాయి.

ఇలాంటి ఉల్కను కొందరు వ్యాపార వస్తువుగా మార్చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఉల్కలు వంటివి అంతరిక్షం నుంచి అప్పుడప్పుడు భూమిపై పడుతుంటాయి.ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ ఇటీవల కీలక విషయాన్ని వెల్లడించింది.ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ కోపర్ని మెటోరైట్ బ్యాగ్( Koperni Meteorite Bag ) ఈ ఉల్కతో వెరైటీగా పర్స్ తయారు చేసింది.

మీరు విన్నది నిజమే.ఆ పర్సును చూడగానే అంతా ఆశ్చర్యపోతున్నారు.చూడడానికి ఉల్కలాగే ఉందని అనుకుంటున్నారు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..

అయితే ఈ ఉల్కతో తయారు చేసిన పర్సును కొనాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.దీని బరువు సుమారు 2 కిలోలు ఉంటుంది.దీనిని కొనాలంటే రూ.35 లక్షలు చెల్లించాలి.అంత ఖర్చు పెట్టి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినా, డెలివరీ చేయడానికి 6 వారాల సమయం పడుతుంది.

Advertisement

అయితే నలుగురిలో విభిన్నంగా ఉండాలనుకునే వారికి కొదువ లేదు.ముఖ్యంగా వెరైటీ పర్సులంటే మహిళలు మక్కువ చూపుతారు.దీంతో తమ ఉత్పత్తులకు ఢోకా ఉండదని ఆ కంపెనీ భావిస్తోంది.

తాజా వార్తలు