Bicycle Dining table : ఇదేందయ్యా ఇది.. పాత సైకిల్ టైర్ తో డైనింగ్ టేబుల్ తయారీ.. వీడియో చూస్తే…

సాధారణంగా మనం పాడైపోయిన వస్తువులని బయటపారేస్తుంటాం.

కానీ కొంతమంది మాత్రం తమ తెలివితేటలను ఉపయోగించి పనికిరాని, కాలం చెల్లిన వస్తువులను కూడా ఏదో ఒక రకంగా ఉపయోగిస్తుంటారు.

అందరూ ఇలానే చేయాలంటూ వీడియోలు తీసి సోషల్ మీడియా లో షేర్ చేసి మరీ ప్రోత్సహిస్తుంటారు.అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతూ నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తుంది.

ఆ వీడియోలో ఏముంది? పనికిరాని వస్తువుని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Making A Dining Table With An Old Bicycle Tire If You Watch The Video

వైరల్ వీడియో ప్రకారం, ఒక వ్యక్తి సైకిల్ టైర్( Bicycle tire ) తో డైనింగ్ టేబుల్ ని తయారు చేశాడు.సదరు వ్యక్తి పనికిరాని పాత సైకిల్ టైర్ ని పడేయకుండా దానిని డైనింగ్ టేబుల్ లా వాడుకోవచ్చని నిరూపించాడు.నిజానికి సైకిల్ పాడైతే దానిని పక్కన పడేసి కొత్త సైకిల్ కొంటాం.

Advertisement
Making A Dining Table With An Old Bicycle Tire If You Watch The Video-Bicycle D

ఇనుప సామాన్లు చేసేవారికి పాత సైకిల్ను అమ్మేస్తాం.కానీ ఒక వ్యక్తి మాత్రం అలా చెయ్యకుండా పాత సైకిల్ చక్రానికి ఒక ఇనుప కడ్డీకి బిగించి దానిపై వండిన ఆహారపదార్ధాల గిన్నెలను, ప్లేట్లను అమర్చాడు.

Making A Dining Table With An Old Bicycle Tire If You Watch The Video

అలా అమర్చిన టైర్ డైనింగ్ టేబుల్( Dining table ) కి ఎదురుగా ఆ వ్యక్తి స్టూల్ వేసుకుని కూర్చుని తనకు కావాల్సిన ఆహార పదార్ధాలు అందుకోవడం కోసం వీల్ తిప్పుతూ వాటిని వడ్డించుకుంటూ ఆస్వాదిస్తూ తింటున్నాడు.దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఈ సైకిల్ టేబుల్ నెటిజన్లకు తెగ నచ్చేసింది.ఇప్పటికే ఈ వీడియోని 1.9 కోట్ల మందికి పైగా వీక్షించారు.‘మధ్యతరగతి డైనింగ్ టేబుల్, ‘తక్కువ బడ్జెట్ లో మంచి ఆలోచన’ అంటూ ఆ వ్యక్తి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు