పవర్ స్టార్ 'ఓజి' కోసం ఆ టైటిల్ ను లాక్ చేసారా.. వెరీ పవర్ఫుల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.

భారీ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.అప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది.పవన్ వారాహి యాత్రలో బిజీగా ఉన్న కూడా ఈ సినిమా షూట్ ఏ మాత్రం ఆపలేదు.

మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

Advertisement

అయితే ఈ సినిమాకు టైటిల్ ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించక పోవడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ పలు రకాల పవర్ఫుల్ ట్యాగ్స్ తోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేసారు.ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్, దే కాల్ హిం ఓజి అనే ట్యాగ్ లను రివీల్ చేయగా అవి అదిరిపోయే లెవల్లో పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్.అది కూడా దే కాల్ హిం ఓజి అనే పవర్ఫుల్ టైటిల్ ను పవర్ స్టార్ కోసం లాక్ చేసారని తాజాగా కోలీవుడ్ వర్గాల నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అయ్యింది.కాగా ఈ సినిమాకు థమన్ ( Thaman )సంగీతం అందిస్తుండగా.

డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

జగన్ కు ఇదే అతిపెద్ద సవాల్ ! మారుతారో మార్చుతారో ? 
Advertisement

తాజా వార్తలు