నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! ఏడుగురు మృతి!

నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు.

దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండమల్లేపల్లి సమీపంలో టోల్ గేట్ వద్ద ఓ టాటా ఏస్ ని ఢీకొంది.సాగర్ హైవే దగ్గర జరిగిన ప్రమాదంలో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ఏడు మంది ప్రయాణికులు చనిపోవడం గమనార్హం.

ఇక ఈ ప్రమాదంలో మరో పది మంది ప్రయాణికులు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలో హాస్పిటల్లో చేసినట్లు తెలుస్తుంది.ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

ఇక ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు