వైరల్: Tea ఎస్టేట్‌లో టైగర్ ఎలా తిరుగుతుందో చూడండి… రెండు కళ్ళు సరిపోవు!

సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపైన ఏ విధంగా వుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

స్మార్ట్ ఫోన్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోవడంతో సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా తీవ్రంగా వుంది.

ఈ క్రమంలో ఎక్కువగా జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.తాజాగా తేయాకు తోటలో హాయిగా విహారం చేస్తున్న టైగ‌ర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోని IFS అధికారి సుశాంత నంద సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా వెలుగు చూసింది.

ఈ వీడియోను మొదట వైల్డ్‌ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ అయినటువంటి మ‌నో షేర్ చేయ‌గా దానిని సుశాంత నంద రీట్వీట్ చేయడం జరిగింది.ఇక వైరల్‌ అవుతున్న వీడియోని గమనిస్తే, ఒక టీ ఎస్టేట్‌లో టైగ‌ర్ దర్జాగా సంచరిస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు.పులుల‌ను చూసేందుకు ప‌లువురు స‌ఫారీలో టైగ‌ర్ రిజర్వ్‌ల‌కు వెళుతుంటారు.

Advertisement

ఇలాంటి టైగ‌ర్ వారికి క‌నిపించ‌దని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇవ్వడం గమనించవచ్చు.కాగా ఈ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

ఇప్పటి వరకు వీడియోకి 11,000లకు పైగా చూడగా, పలువురు తమదైన స్టైల్లో కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

అవును, ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు సీన‌రీ అద్భుతంగా ఉంద‌ని కామెంట్ చేస్తున్నారు.ఒక యూజర్ స్వ‌చ్ఛ‌మైన అంద‌మ‌ని కామెంట్ చేయగా, మరో యూజర్ నిజంగా గ్రాండ్ అండ్ మేజెస్టిక్ అని కామెంట్ చేసాడు.ఇంకొందరు ఈ టీ ఎస్టేట్ ఎక్క‌డ ఉందో కాస్త చెప్పగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.సదరు వీడియో చూస్తుంటే త‌న‌కు 1980ల్లో ఓల్ట్ లిప్ట‌న్ టైగ‌ర్ టీ యాడ్ గుర్తుకువ‌చ్చింద‌ని కామెంట్ చేయడం గమనార్హం.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు