హాట్రిక్ ఛాన్సులు.. హ్యాట్రిక్ హిట్ లు.. మైత్రి మూవీ మేకర్స్ సూపర్ ప్లాన్?

ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు విడుదల అవుతున్న కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి.బాక్సాఫీసు వద్ద సత్తాచాటి మంచి వసూళ్లతో విజయం సాధిస్తూ ఉన్నాయి.

ఇక ఇలా బాక్సాఫీస్వద్ద సత్తా చాటుతున్న సినిమాలలో చాలా మటుకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణసంస్థ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.సినిమాను ఎలా షేర్ చేయాలి ప్రేక్షకులకు ఎలా దగ్గర చేయాలి అన్న విషయాన్ని బాగా కనిపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇక తమ నిర్మాణంలో వచ్చే ప్రతి సినిమా హిట్టు కొట్టే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే చేసిన దర్శకులు తోనే మరో సినిమా చేస్తూ ఇక దర్శకులకు హాట్రిక్ హిట్స్ అందిస్తూ ఉండడం గమనార్హం.ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రేపు అంటే సుందరానికి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

వికాస్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది.ఇక ఈ సినిమా సినిమా ట్రైలర్ చూస్తే పక్కా హిట్ అన్నది తెలుస్తుంది.

Advertisement

అయితే వివేక్ ఆత్రేయ కు ఇది మైత్రి మూవీ మేకర్స్ తో మూడవ సినిమా కావడం గమనార్హం.ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ ఇక ఇప్పుడు అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇక అంతకు ముందు ఇక కొరటాల శివ కూడా ఈ నిర్మాణసంస్థలో హ్యాట్రిక్ కొట్టడం గమనార్హం.మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కొరటాలతో శ్రీమంతుడు సినిమాను కూడా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్.ఆ తర్వాత జనతా గ్యారేజ్ కూడా చేసి కొరటాలకు ఈ బ్యానర్ లో హ్యాట్రిక్ ఇచ్చేసింది.

కార్తికేయ, ప్రేమమ్ లాంటి హిట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే కొట్టిన చందు మొండేటి ఇక సవ్యసాచి సినిమాతో ఈ బ్యానర్ లోనే హిట్ కొట్టాడు అన్న విషయం తెలిసిందే.మరి ఇప్పుడు వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి సినిమాతో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు