‘శ్రీమంతుడు’ సెన్సార్‌ టాక్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ ఈనె 7న వచ్చేందుకు సర్వం సిద్దం అయ్యింది.

నిన్న ఈ సినిమా సెన్సార్‌ జరగాల్సి ఉన్నా కూడా కొన్ని టెక్నికల్‌ సమస్యల వల్ల వాయిదా వేయడం జరిగింది.

తాజాగా నేడు ఈ సినిమా సెన్సార్‌ బోర్డు ముందుకు వెళ్లింది.ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు వారు ‘యూ/ఎ’ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా కొన్ని సీన్స్‌లో డైలాగ్స్‌కు మ్యూట్‌ చెప్పడంతో పాటు, హీరోయిన్‌ అందాలకు అక్కడక్కడ మసక వేశారు.ఇక మద్యం, పొగ తాగే సన్నివేశాల సమయంలో హెచ్చరిస్తూ సందేశాన్ని ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా గత నెల 17న రావాల్సి ఉన్నా కూడా ‘బాహుబలి’కి పోటీ వద్దనే ఉద్దేశ్యంతో వాయిదా వేయడం జరిగింది.

Advertisement

భారీ అంచనాలున్న ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యింది.ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు నుండి కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

సెన్సార్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన బోర్డు సభ్యులు చిత్ర దర్శకుడు మరియు నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు అంచనాలు మరింతగా పెరిగాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటించింది.

నిన్ను పెట్టి సినిమా తీస్తే ఎవడైనా చూస్తాడా అంటూ తారక్ పై రాజమౌళి ఆగ్రహం
Advertisement