మహేష్ లుక్ పై షాకింగ్ కామెంట్స్.. గౌతమ్‌కు అన్నలా ఉన్నాడంటూ?

టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం గురించి తెలియని వాళ్ళెవరు లేరు.

తన నటనతో, తన లుక్ తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.

ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలతో బాగా బిజీగా ఉన్నాడు మహేష్ బాబు.ఇక తన వయసు పెరుగుతున్న కొద్దీ తన హ్యాండ్సమ్ లుక్ ను కూడా పెంచుకుంటూనే ఉన్నాడు.

పైగా ఈయన అందానికి ఎంతోమంది అమ్మాయిలు కూడా ఫిదా అయ్యారు.బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మహేష్ బాబు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.

తన మొదటి సినిమా రాజకుమారుడులో తన లుక్ తో అందర్నీ ఫిదా చేశాడు.ఇక ఇప్పటి వరకు తన అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు మహేష్.

Advertisement

అంతేకాకుండా తన శరీరం విషయంలో కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటాడు.ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శరీరాన్ని కాపాడుకుంటాడు.

అప్పుడప్పుడు మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా మహేష్ పిల్లలతో ఆడుతున్న వీడియోలను బాగా పంచుకుంటుంది.

అందులో కూడా మహేష్ బాబు ఎంతో క్యూట్ గా కనిపించడంతో పాటు.తన కొడుకు గౌతమ్ తో కనిపించినప్పుడల్లా గౌతమ్ కు అన్న లా అనిపిస్తుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర థమ్స్ అప్ యాడ్ లో కనిపించగా అందులో ఖాళీ చేసిన థమ్స్ అప్ బాటిల్ ని చూపిస్తూ ఫోటోకి ఫోజులు ఇచ్చాడు.

ఇక ఇందులో మహేష్ బాబు టీనేజర్ గా కనిపించడంతో ఈ ఫోటోకి తెగ లైక్స్ చేస్తున్నారు అభిమానులు.అంతేకాకుండా తన కుమారుడు గౌతమ్ కృష్ణకు అన్న లా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటించగా.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా తర్వాత రాజమౌళితో మరో సినిమా ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.మొత్తానికి వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు మహేష్.

తాజా వార్తలు