టీపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ?

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు జరుగుతుంది.

ఇప్పటికే ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు , సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో ఈ విషయంపై చర్చించారు.

తాను ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలను నిర్వహించడం ఇబ్బందికరంగా ఉందని,  తనను తప్పించి మరొకరికి ఆ అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దలకు మొరపెట్టుకున్నారు.అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో,  కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టింది.

రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వారిని పిసిసి చీఫ్ గా నియమిస్తే మంచిదని అధిష్టానం భావిస్తోంది.

ఈ క్రమంలో సీనియర్ నేతలు మధు యాష్కి గౌడ్ , మహేష్ కుమార్ గౌడ్ ( Madhu Yashki Goud, Mahesh Kumar Goud )తో పాటు, సీనియర్ నేతలు జగ్గారెడ్డి , కోమటిరెడ్డి బ్రదర్స్ , బలరాం నాయక్ , సీతక్క తదితరులు ఈ పదవిపై ఆశలు పెట్టుకుని అధిష్టానం వద్ద లాభీయింగ్ చేశారు.  మహేష్  కుమార్ గౌడ్ వైపు అధిష్టానం ప్రజలు కూడా మొగ్గు చూపిస్తున్నట్లు విశ్వాసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.రేవంత్ రెడ్డి తో మహేష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం,  బీసీ నాయకుడు కావడం,  ఎన్ ఎస్ యు ఐ నుంచి పార్టీలో ఎదిగిన నేతగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉండడంతో , మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చే అంశాలు.

Advertisement

  అలాగే రేవంత్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉండడంతో ఆయన కూడా అధిష్టానానికి ఆయన పేరును సిఫార్సు చేశారట.

పార్టీకి ప్రభుత్వం మధ్య సమన్వయం చెడిపోకుండా ఇద్దరూ బాధ్యతలు నిర్వహిస్తారని అధిష్టానం భావిస్తూ ఉండడంతో,  మహేష్ కుమార్ కు పిసిసి అధ్యక్ష బాధ్యతలు త్వరలోనే అప్పగించబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు