సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం చోటు చేసుకుంది.
ఆమె తల్లి ఇందిరా దేవి గారి మరణంతో మహేష్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ రోజు ఉదయం ఇందిరా దేవి గారి మరణ వార్త విని ఘట్టమనేని వారి ఇంట మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా తీరని విషాదం చోటు చేసుకుంది.దీంతో ఈ వార్త విని టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణను పరామర్శించి వారికీ ధైర్యం చెబుతున్నారు.
మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు మహేష్ బాబు తల్లి మరణించడంతో సంతాపం తెలుపు తున్నారు.ఆమె ఆరోగ్య సమస్యలతో మరణించినట్టు తెలుస్తుంది.
హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించడంతో మహేష్ బాబు, కృష్ణ లు ఈ వార్త విని క్రుంగి పోతున్నారు.కృష్ణ గారికి ఇందిరా దేవి మొదటి భార్య.
అయితే ఈమె తర్వాత విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాడు.అయినా ఇందిరా గారికి కానీ పిల్లలకు కానీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు.
2018లో విజయ నిర్మల మరణించడంతో క్రుంగి పోయిన కృష్ణ కాస్త కోలుకునే లోపే ఇటీవలే కొడుకు రమేష్ బాబు మరణించాడు.దీంతో కృష్ణ గారితో పాటు మహేష్ బాబు కు అన్నను కోల్పోయి చాలా క్రుంగి పోయారు.దీని నుండి కోలుకునే లోపే మళ్ళీ తల్లి మరణించడంతో మహేష్ మరోసారి ఎమోషనల్ అయ్యారు.
ఇది ఇలా ఉండగా ఇందిరా దేవి గారి అంత్యక్రియలు గురించి తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది.
ఈమె అంత్యక్రియలను ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారో అనే సమాచారం తాజాగా బయటకు వచ్చింది.ఇందిరా గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నట్టు తెలుస్తుంది.ఈమె పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్ లో ఉంచుతారు.
ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో మహాప్రస్థానంలో ఈమె అంత్యక్రియలు జరగనున్నాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy