Mahesh Babu : మహేష్ బాబు ప్లాన్స్ మామూలుగా లేవుగా.. అక్కడ ఏఎంబీని మించిన మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి మనందరికీ తెలిసిందే.

మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరకవైపు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూ అలాగే బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు.కేవలం సినిమా రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తున్నారు మహేష్ బాబు.

అయితే మహేష్ బాబు కు చాలా రకాల బిజినెస్ లు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.అటన్నింటినీ కూడా నమ్రత( Namrata ) దగ్గర ఉండి చూసుకుంటుంది.

అందులో భాగంగానే మహేష్ బాబు పలు మల్టీప్లెక్స్ ల( Multiplex ) ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇప్పటికే ఉన్నాయి థియేటర్లతో పాటు ఇంకా కొన్ని నిర్మించడానికి పునాదులు వేస్తున్నారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుత రోజుల్లో సింగిల్‌ థియేటర్స్‌ మల్టీఫ్లెక్స్‌లుగా మారిపోతున్న విషయం తెలిసిందే.చాలారోజుల క్రితం అనివార్య కారణాల వల్ల మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో( RTC Cross Road ) తమ అభిమాన హీరో సినిమా చూడాలని చాలా మంది ఫ్యాన్స్‌ ముచ్చట పడుతుంటారు.అక్కడ ఓ రేంజ్‌లో సందడి ఉంటుంది.

ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు.తమ అభిమాన హీరోలకు నిలువెత్తు కటౌట్లు పెట్టడం దగ్గర నుంచి వందల కొద్ది ఫెక్సీలు కట్టేస్తారు.

పాలాభిషేకాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఇలా ఒకటేంటి అబ్బో చెప్పలేనంత హడావిడి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో కనిపిస్తుంది.సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, అభిమానులు మాత్రం తమ హీరోలకు బ్రహ్మరథం పట్టేస్తారు.ఆ థియేటర్స్‌ వద్ద వారి సందడి ఒక రేంజ్‌లో ఉంటుంది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రస్తుతం దేవి, సుదర్శన్ 35MM, సంధ్య థియేటర్స్ ఉన్నాయి.సుదర్శన్‌ 70MM( Sudarshan 70MM ) సింగిల్‌ స్క్రీన్‌ కూడా అక్కడ ఉండేది.2010లో అనివార్య కారణాల వల్ల అది మూతపడింది.ఇప్పుడు దానిని మహేశ్‌ బాబు రీఓపెన్‌ చేస్తున్నారని టాక్‌.

Advertisement

అందులో AMB పేరుతో 7 స్క్రీన్స్‌ ఉండేలా మల్టీఫ్లెక్స్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారని తెలుస్తోంది.

AMB క్లాసిక్ పేరుతో అక్కడ బిగ్‌ మల్టీఫ్లెక్స్‌ ప్రారంభం కాబోతుందని సమాచారం.ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ముఖ్యంగా మహేశ్​ బాబుకు ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ అందుకే గుంటూరు కారం( Guntur Karam ) సినిమా షూటింగ్‌ కూడా అక్కడ కొంత భాగం తీశారు.

ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాను మొదటిరోజు ఫ్యాన్స్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు అక్కడే చూస్తారు.కాబట్టి సుదర్శన్ థియేటర్ ను తీసుకొని ఏఎంబీ థియేటర్ నీ మించి ఆ థియేటర్ ను కొత్తగా రూపొందించాలని చూస్తున్నారట మహేష్ బాబు.

తాజా వార్తలు