నా టాలెంట్ గురించి త్రివిక్రమ్ కి తెలుసు.. బాగా వాడేసారు.. మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గుంటూరు కారం (Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కాస్త ఆలస్యమైన అద్భుతమైనటువంటి కలెక్షన్లను రాబడుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం మహేష్ బాబు శ్రీ లీల (Sreeleela) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ అలాగే స్లాంగ్ అండ్ క్యారక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

గుంటూరు కారం సినిమా కోసం నేను స్లాంగ్ అండ్ క్యారక్టరైజేషన్ కొత్తగా ట్రై చేసినది కాదు.ఎవరికి తెలియని విషయం ఏమిటంటే మా అమ్మ ,అమ్మమ్మ ఇంట్లో ఎక్కువగా గుంటూరు స్లాంగ్( Guntur Slang ) మాట్లాడేవారు నేను వారితో మాట్లాడేటప్పుడు గుంటూరు స్లాంగ్ లోనే మాట్లాడేవాడిని కనుక నాకు ఈ సినిమాలో నటించడానికి పెద్దగా ఇబ్బంది లేదని మహేష్ బాబు తెలిపారు.అదేవిధంగా నాలో మరో టాలెంట్ కూడా ఉంది అంటూ ఈయన ఎవరికీ తెలియని తనలో ఉన్నటువంటి టాలెంట్ గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.

Advertisement

నేను ఎవరితోనైనా రెండు గంటల పాటు మాట్లాడాను అంటే అచ్చుగుద్దినట్టు వారిలాగే మాట్లాడగలిగే టాలెంట్ ఉందని మహేష్ బాబు తెలిపారు.నాలో ఉన్న ఈ టాలెంట్ గురించి త్రివిక్రమ్(Trivikram Srinivas) గారికి బాగా తెలుసు అందుకే ఆయన నాలో ఉన్న ఈ టాలెంట్ ఉపయోగించుకున్నారు అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన విషయం మనకు తెలిసిందే.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు