Mahesh Babu: నా సినిమాలు ఫ్లాప్ అయినా నాదే బాధ్యతన్న మహేశ్.. ఇలా చెప్పే టాలీవుడ్ హీరోలు ఉన్నారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో మహేష్ బాబుకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు మహేష్ బాబు.రీ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వేలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు.

ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో( Guntur Karam Movie ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఒక వైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి మహేశ్‌ దంపతులు హాజరయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో భాగంగా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా తన తండ్రి దివంగత నటుడు కృష్ణను( Hero Krishna ) గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.

నేను నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందనప్పుడు నిరుత్సాహ పడతాను.ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది.దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను.

అలాగే తర్వాతి సినిమాపై ఎక్కువ దృష్టి పెడతాను.మనం స్టార్‌ హీరో అయినప్పుడు ఒత్తిడిని అంగీకరించాలి.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను.ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన చెప్పేవారు.

Advertisement

క్రమశిక్షణ, వినయం వంటి వాటి ప్రాముఖ్యతను ఆయనే నేర్పించారు.విజయం ఒక్కసారిగా రాదని ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటేగాని వరిస్తుందని చెప్పారు అంటూ మహేశ్‌ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

కాగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా జనవరిలో విడుదల కానుంది.

తాజా వార్తలు