మహేష్ అంటే ఇష్టం అంటున్న హీరోయిన్

రాహుల్ రవీంద్రన్ " అలా ఎలా" తో తెలుగు పరిశ్రమను పలకరించింది హేబా పటేల్.తొలిచిత్రంతోనే తన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది హేబా.

తోలి చిత్రంలో పట్టు పరికిణిలో ఫక్తు పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన హేబా రెండో చిత్రం " కుమారి 21 F" లో దీనికి పూర్తీ భిన్నంగా కనిపించనుంది.దర్శకుడు సుకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో నేటి మోడ్రన్ యువతిగా మనల్ని అలరించనుంది.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో మాట్లాడిన హేబా పటేల్ తెలుగు సినిమాలు అప్పుడప్పుడు చూస్తాను అని చెప్పింది.మరి అభిమాన నటులు ఎవరు అని అడిగిన ఒక ప్రశ్నకు సమాధనామిస్తూ " మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం.

ఆయన ఎంత అందంగా ఉంటారో అంతకన్నా బాగా నటిస్తారు.ఆయనతో ఒక్క అవకాశమైన రావాలి.

Advertisement

అలాగే అనుష్క శెట్టి, కరీనా కపూర్, జెనీలియా అంటే నాకు చాలా ఇష్టం.నేను హీరోయిన్ కావాలనుకుంది వాళ్ళను చూసే.

వాళ్ళే నా రోల్ మోడల్స్.ముఖ్యంగా జెనిలియాను బాగా ఫాలో అవుతాను.

తను తెలుగు సినిమాల్లో నటిస్తూ.బాలీవుడ్ లో కూడా నటించేది.

తను చేసిన బొమ్మరిల్లు నాకు నచ్చింది.హాసిని లాంటి పాత్ర ఎప్పటికైనా చేయాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అలాంటి పాత్ర వస్తే తనను స్పూర్తిగా తీసుకుంటాను." .

Advertisement

తాజా వార్తలు