మదర్స్ డే స్పెషల్ విషెష్ చెప్పిన మహేష్.. పిక్స్ వైరల్!

ఈ రోజు ప్రపంచ మాతృ మూర్తులందరికి ఓకే ప్రత్యేక రోజు.ఈ రోజును మదర్స్ డే గా జరుపు కుంటున్నాం.

ఇక ఈ నేపథ్యంలోనే ఇండియన్ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మదర్స్ డే విషెష్ చెబుతూ తమ తల్లులతో గడిపిన మధుర క్షణాలను తెలుపుతూ వారి ఫోటోలను పంచుకుంటున్నారు.తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ రోజు మదర్స్ డే సందర్భంగా స్పెషల్ విషెష్ చెబుతూ వారి మదర్, భార్య ఫోటోలను షేర్ చేసారు.

ఈయన సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతూ. నా తల్లికి.

నా లైఫ్ లైన్స్ అయిన నా బిడ్డలా తల్లికి వారితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి మదర్స్ డే విషెష్ తెలుపుతున్నాను.మీ అందరి మీద గౌరవం, ప్రేమ ఎప్పటికి చెరిగిపోవు.

Advertisement

అంటూ చెప్పుకొచ్చారు మహేష్.ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తిగా మారడంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.

ఈయన షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.ఇక తాజాగా ఈయన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఇప్పటికే ఈ సినిమ నుండి వచ్చిన ట్రైలర్, పోస్టర్స్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి.ఈ సినిమాలో మహేష్ బాబు మరింత అందంగా, యంగ్ గా వింటేజ్ లుక్ తో లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

చూడాలి మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో.

Advertisement