మహేష్‌, త్రివిక్రమ్‌ మూవీ విడుదల విషయమై ఆసక్తికర పుకార్లు

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ నెలలోనే రావాల్సి ఉంది.

కానీ మహేష్ బాబు( Mahesh Babu )కుటుంబంలో జరిగిన వరస విషాదాల కారణంగా సినిమా ఆలస్యమైంది.

ఏప్రిల్ లో విడుదల చేయలేం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆగస్టు నెలకు వాయిదా వేయడం జరిగింది.చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ స్వయంగా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్( Trivikram ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

Mahesh Babu And Trivikram Movie Release Date Update And Rumors,mahesh Babu,trivi

దాంతో అభిమానులంతా ఆసక్తిగా ఆగస్టు నెల కోసం ఎదురు చూస్తున్నారు.కానీ తాజాగా త్రివిక్రమ్ నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా ఒకటి జులై చివరి వారం లో విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.దాంతో మహేష్ బాబు తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా ఆగస్టులో రావడం కష్టమే అనే అభిప్రాయాన్ని ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu And Trivikram Movie Release Date Update And Rumors,mahesh Babu,trivi

మహేష్ బాబు సినిమా ను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే దసరా( Dasara ) కు మహేష్ బాబు సినిమా మాత్రమే కాకుండా నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా విడుదల కాబోతుంది.కనుక ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటి నుండే ప్రచారం మొదలైంది.

Advertisement
Mahesh Babu And Trivikram Movie Release Date Update And Rumors,mahesh Babu,trivi

మహేష్ బాబు వస్తానంటే బాలకృష్ణ సైడ్ అవుతాడా.లేదంటే పోటీకి సిద్ధం అంటాడా అనేది చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.చాలా సంవత్సరాల తర్వాత మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ వస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

మహేష్ బాబు తన తదుపరి సినిమా ను జక్కన్న రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు