రాజమౌళి సినిమాకు మహేష్ బాబు పారితోషికం ఎంతో తెలుసా!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తో రామ్‌ చరణ్( Ram Charan ) మరియు ఎన్టీఆర్ ల యొక్క స్థాయి పాన్ ఇండియా ను మించింది అనడంలో సందేహం లేదు.

ఆ స్థాయి లో ఇప్పుడు మహేష్ బాబు కూడా క్రేజ్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఆర్ ఆర్‌ ఆర్‌( RRR ) సినిమాకు ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబు తో రూపొందించబోతున్న సినిమా ఉంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

Mahesh Babu And Rajamouli Film Interesting Update , Mahesh Babu, Rajamouli , Fl

రాజమౌళి తన సినిమా సినిమాకు అత్యాధునిక టెక్నాలజీని( Technology ) ఉపయోగిస్తూనే ఉన్నాడు.తాజాగా మరోసారి మహేష్ బాబు సినిమా కోసం అంతకు మించి అన్నట్లుగా టెక్నాలజీని తీసుకు వచ్చి విజువల్ వండర్ గా చూపించేందుకు గాను అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సంస్థతో( VFX company ) ఒప్పందాలు చేసుకోవడం జరిగింది.రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు నటించేందుకు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు డేట్లు ఇవ్వడం జరిగిందట.

దాంతో మహేష్ బాబు కు ఏకంగా వంద కోట్ల పారితోషికం ను నిర్మాతలు ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

Mahesh Babu And Rajamouli Film Interesting Update , Mahesh Babu, Rajamouli , Fl
Advertisement
Mahesh Babu And Rajamouli Film Interesting Update , Mahesh Babu, Rajamouli , Fl

మరో వైపు మహేష్ బాబు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకోబోతున్నాడు.వంద కోట్ల పారితోషికంను తన యొక్క వాటాగా పెట్టి నిర్మాణం చేపట్టబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.మొత్తానికి మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో సినిమా కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.

రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలు అయ్యింది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజమౌళి సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు