బాలయ్య, మహేష్‌ బాబులకు ఆ సమస్య.. దర్శకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) మరియు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే విడుదలకు సంబంధించిన తేదీ విషయంలో క్లారిటీ వచ్చింది.

దసరాకు రచ్చ రచ్చ ఉండబోతుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.కానీ ఇప్పటి వరకు సినిమా యొక్క టైటిల్ ను ప్రకటించక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్‌ ( Kajal Aggarwal )హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కు కూతురు పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే ఆమె షూట్‌ లో పాల్గొంది.ఈ సినిమా యొక్క టైటిల్ ను ఎప్పటి వరకు ఖరారు చేస్తారా అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.అందుకే ఈ సినిమా కు అంతే పవర్ ఫుల్ గా టైటిల్ ను పెట్టాలని భావిస్తున్నారు.

బాలయ్య తో పాటు సూపర్ స్టార్‌ మహేష్ బాబు కూడా టైటిల్ విషయంలో గందరగోళంగా ఉన్నాడు.ఇప్పటి వరకు షూటింగ్ సగం పూర్తి చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కనీసం టైటిల్ విషయంలో హింట్‌ ఇవ్వడం లేదు.కొన్ని టైటిల్స్ ప్రచారం జరుగుతున్నాయి కానీ అందులో ఏది ఫైనల్ అవుతుంది అనేది తెలియడం లేదు.

మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్లుగా ఆకట్టుకునే టైటిల్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇదే సమయంలో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా యొక్క టైటిల్ ను గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గుంటూరుకు అటు ఇటు అంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే త్రివిక్రమ్ నుండి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నింటికి కూడా అ అనే అక్షరంతో టైటిల్ ను పెడుతున్న విషయం తెల్సిందే.ఇప్పుడు కూడా అదే ఫార్ములాను పాటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

అందుకే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబో మూవీ టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు