సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 24 తేదివరకు అక్కడే షూటింగ్ పాల్గొని, ఆ తరువాత నూతన సంవత్సర వేడుకల కోసం ఫ్యామిలితో పాటు విదేశాలకు బయలుదేరుతాడు మహేష్.
ఇక విషయంలోకి వెళితే, ఇప్పటిదాక మనం విన్నట్లుగా, మహేష్ 23 శాటిలైట్ హక్కులు 26 కోట్లకే అమ్ముడుపోలేదట.సర్వీస్ ట్యాక్స్ కలిపి 30 కోట్లకు జీ సంస్థ తెలుగు - హిందీ టీవి రైట్స్ దక్కించుకుంది.
అయితే సర్వీస్ ట్యాక్స్ తీసేస్తే, మళ్ళీ అదే లెక్క.అంటే 26 కోట్లు.
ఏరకంగా చూసిన ఓ భారి రికార్డు.తమిళ వెర్షన్ శాటిలైట్ కలుపుకోని ఈ చిత్రం కేవలం శాటిలైట్ హక్కలు ద్వారానే 38-40 కోట్లు రాబట్టవచ్చు.
మరో వార్త ఏంటంటే, సంభవామి అనే టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదంట.ఏజెంట్ శివ లాగే ఇది కూడా పరిశీలిస్తున్న టైటిల్స్ లో ఒకటి.
జనవరి ఒకటొవ తేదిన సినిమా పేరు ఖరారు చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా బిజినెస్ 150 కోట్ల దాకా వెళుతుందని ఇప్పటికే తెలుగుస్టాప్ వార్తను అందించింది.
రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ గా, ప్రముఖ తమిళ హీరో భరత్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.ఈ భారి ద్విభాష్ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy